ఆర్టికల్ 1 లో భారతదేశం అనగా భారత్ అని, భారత అనేది రాష్ట్రాల యూనియన్ గా చెప్పబడింది.

Bharat vs India: A Historical and Constitutional Journey/murthyadvise.blogspot.com  article 1 of indian constitution, article 1 of indian constitution in hindi, article 1 of indian constitution pdf, article 1 of indian constitution malayalam, article 1 of indian constitution upsc, article 1 of indian constitution in tamil, article 1 of indian constitution in telugu, article 1 of indian constitution in kannada, article 1 of indian constitution in english, article 1 of indian constitution explanation, what is article in indian constitution article 1 of indian constitution amendment, article 1 of indian constitution in assamese, article 1 of indian constitution defines india as, article 1 of indian constitution declares india as, article 1 of indian constitution describe india as, article 1 of the constitution india, what is an article 1 of the constitution, article 1 of indian constitution in bengali, article 1 of indian constitution case laws, article 1 of indian constitution deals with article 1 of indian constitution declares that, article 1 of indian constitution describe, article 1 of indian constitution in detail, article 1 describe, article 1 details, article 1 of constitution explained, article 1 from indian constitution, what is article 1, full article 1 of the constitution, article 1 o f the constitution, fact about article 1 of the constitution, article 1 of indian constitution in gujarati, article 1 history, article 1 of indian constitution in marathi, article 1 of indian constitution in odia, article 1 of indian constitution in malayalam, what is article 1 of the constitution simplified, what is article 1 of the constitution saying, constitution article 1 overview, constitution article 1 title, article 1 of indian constitution indian kanoon, what is article 1 of constitution, article 1 of indian constitution marathi, article 1 of indian constitution meaning, what is article 1 of the constitution, original article 1 of indian constitution, what is article 1 of the constitution all about, article 1 of indian constitution reads, article 1 of indian constitution related to article one of the indian constitution reads, article 1 in constitution, article 1 of indian constitution says, article 1 of indian constitution states, article 1 of indian constitution in simple words, what does article 1 of indian constitution says, what does article 1 of indian constitution state, article one of the indian constitution states, article 1 of indian constitution testbook, article 1 of indian constitution telugu, article 1 of indian constitution states that, article 1 of the indian constitution, article 1 of the indian constitution reads, what does article 1 of the constitution say, article 1 of indian constitution wikipedia, what says article 1 of indian constitution, what is article 1 of the constitution called, article 1 0f the constitution.


     గతంలో భారత దేశానికి గల వివిధ పేర్లు ఏమేమి ఉన్నాయో అవి ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.


 1) మెలుహ (మెళుహ/మెలుహ) :

     ఇది అతి ప్రాచీనమైన పేరు. ఈ పేరును మనం మెసెపటోనియా నాగరిక చరిత్రలో  (క్రి.పూ 3 వ శతాబ్దం) గమనించవచ్చు.

2) భారత్ / భరత వర్ష :  ఈ పేర్లు వేదాలలో వివరించబడ్డాయి.

     అంతేగాకుండా స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో "భారత్ మాతాకి జై" అని నినదించారు. ఈ నినాదం అనేది నాటి భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

3) ఆర్య వర్త : ఇది ప్రధానంగా మనుస్మృతిలో ఇండో - ఆర్య సంస్కృతిలో వివరించబడింది.

4) జంబూ ద్వీపం : ఈ పదం కూడ వేదాలలో వివరించబడింది.

5) HINDH| HINDUSTAN : ఈ పదాన్ని ముఖ్యంగా ఇరాన్నుండి వచ్చిన పర్షియన్ లు పలికేవారు, వీరు సింధూ నదిని హింద్ అని పిలిచేవారు.

6) ఇండియా : ఇది గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ఇండస్ నది పేరు మీదుగా వచ్చింది. అలెగ్జాందర్ దండయాత్ర అనంతరం  ఈ పేరు ఎక్కువగా ఉండేది . చివరకు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ పేరునే ఉచ్చరించేవాళ్ళు.

     భారత రాజ్యాంగం అమలుకు ముందు భారత రాజ్యాంగ అసెంబ్లీలో ఇండియా - భారత్ పేర్ల మీద చర్చ జరిగినప్పుడు పలువురి ప్రముఖుల వాదనలు అనంతరం భారతదేశం అనగా భారత్ అనే పదానికి ఎలాంటి మార్పులు సంబవించకుండా ఆమోదించబడింది.

     అలా రాజ్యాంగ సభలో దేశం పేరుపై జరిగిన చర్చలు భారత చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టాలలో ఒకటిగా మిగిలాయి . 1949, సెప్టెంబర్ 18న ఆర్టికల్ 1 పై జరిగిన తుది చర్చలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ "ఇండియా, అది భారత్" (భారతదేశం, అది భారత్) అనే పదప్రయోగాన్ని ఎలా ఖరారు చేశారో ఇక్కడ వివరిస్తున్నాను.

     మొదట 1948లో రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో ఆర్టికల్ 1 కేవలం "ఇండియా రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది" (భారతదేశం రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది) అని మాత్రమే ఉంది. అయితే, దేశీయ మూలాలు ప్రతిబింబించేలా ' భారత్ ' అనే పేరును చేర్చాలని చాలా మంది సభ్యుల డిమాండ్ వచ్చింది. దీనిని తీసుకున్న అంబేద్కర్, సెప్టెంబర్ 18, 1949న "ఇండియా, అది భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది" అనే సవరణను ప్రతిపాదించారు. 

     సభ్యుల భిన్నాభిప్రాయాలు మరియు అంబేద్కర్ సమాధానం:

    అంబేద్కర్ ప్రతిపాదనపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది అందులో భాగంగా పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను కొన్నింటిని పరిశీలించారు....

     HV కామత్ (హరి విష్ణు కామత్ ): భారత్ అనే పేరు మాత్రమే ఉచ్చరించాలని ప్రతిపాదించారు.

     సేద్ గోవింద్ దాస్ : ఇండియా అనగా భారత్ అనే పదాలు దేశం పేరుకు అందమైన పదాలు కావు, భారత్ అదే పదం ముందు రావాలి అని సూచించారు.

     MA అయ్యంగార్ : ఆర్టికల్-1 లో భారత్ కు ప్రత్యామ్నాయంగా భరత్ వర్ష్ ,హిందుస్తాన్ పేర్లను సూచించింది.

     ఈ చర్చ సుదీర్ఘంగా సాగుతోందని, అంబేద్కర్ జోక్యం చేసుకుని సభ్యులను శాంతింపజేశారు. 'భారత్' అనే పేరును చేర్చడానికి ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదని, కేవలం ఆ పదం ఎక్కడ ఉండాలనే దానిపై చర్చ జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ సభ ముందు ఇంకా చాలా పని ఉందని, అనవసరమైన నాగరికత/చారిత్రక చర్చల్లో సమయం వృధా చేయకూడదని సూచించింది. 

     చివరిగా సభ్యులు ప్రతిపాదించిన వివిధ సవరణలపై ఓటింగ్:

     హెచ్.వి. కామత్ ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా 38 ఓట్లు, వ్యతిరేకంగా 51 ఓట్లు రావడంతో అది తిరస్కరించబడింది.

     చివరగా, డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించిన "భారతదేశం, అది భారత్" అనే పదప్రయోగాన్నే సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

      ఈ విధంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 'ఇండియా' పేరును కాపాడుకుంటూనే, మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన 'భారత్'ను రాజ్యాంగంలో అంతర్భాగం చేసి అంబేద్కర్ ఈ వివాదానికి తెరదించారు.

     మరి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 1 ఏమని చెపుతుంది అంటే.....

1) ఇండియా అనబడే భారత్, రాష్ట్రాల యూనియన్ తో ఏర్పడింది.

2) మొదటి షెడ్యూల్‌లో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు.

3) భారత దేశం సాదించిన ఇంకా ఏ ఇతర ప్రాంతమైనా కలిసి ఉంటాయి.

కోర్టు కేసులు - డిమాండ్లు :

     ఇండియా పేరును భారత్ గా మార్చాలని ఢిల్లీకి చెందిన “నామా” అనే వ్యక్తి సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.

     దీని గురించి తన పిటిషన్ లో.....

     ఇంతకాలం భారత దేశం ఇండియా అనే పేరుతో పిలుస్తున్నామూ నిజానికి ఇండియా అనే పదం ఇండస్ నది పేరు మీదుగా వచ్చింది

     భారత్ అనే పదానికి మాత్రం మన స్వేచ్చ పోరాటానికి చాలా దగ్గరి సంబంధం ఉంది, స్వాతంత్ర పోరాటంలో 'భారత్ మాతాకి జై'  అనే నినాదం చాలా గొప్పదని చెప్పారు.

     అందుకే ఇండియా అనే పదాన్ని తొలగించాలని నిర్ణయించారు .

     అయితే దీనికి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారు భారత రాజ్యాంగంలో ఇండియా మరియు భారత్ అనే రెండు పేర్లు కలవు, ఇప్పటికే రాజ్యాంగంలో భారత్ అనే  పిలుస్తున్నాము కావూన భారత దేశం పేరును మార్చడం సుప్రీం కోర్ట్ పని కాదని మీ పిటిషన్‌ను ప్రాదాన్యమైనదిగా భావించబడుతుంది,  ఈ పిఠిషన్ పై తగిన నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుతత్వానికి పంపించాలని తీర్పు ఇచ్చింది.

     ఇలాంటి తీర్పునే 2016లో కూడ సుప్రీం కోర్ట్ ఇచ్చింది.   

     2016లో మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త అయినా నిరంజన్ భట్వాల్ భారతదేశం యొక్క పేరును భారత్ గా మార్చాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

     నాటి సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా ఠాకూర్ కేసు గురించి తీర్పునిస్తూ ప్రతి భారతీయుడికి తన దేశాన్ని ఇండియా  లేదా భారత్ అని ఏ పేరునైనా పిలవడానికి ఎన్నుకునే హక్కు అని తెలియజేశారు, ఒక పౌరుడు తన దేశాన్ని ఏమని పిలవాలో  నిర్ణయించడం సుప్రీం కోర్ట్ పని కాదని పేర్కొన్నారు.

     చివరిగా ఒక మాట ఏంటంటే భారత్ అనగా ఒక భౌగోళికమైన ప్రాంతమే కాదు  సామాజికంగా, మతపరమైన సారూప్యత కల్గిన భిన్న సంస్కృతుల మేళవింపు గల ప్రదేశం కావున భారత్ కానీ, ఇండియా కానీ, హిందూస్తాన్ అని కానీ, భారత మాత అని కానీ సంభోదించినంత మాత్రాన మన భారతావనికి  ఎలాంటి నష్టం వాటిల్లదు.