NSAID అనగా నాన్ స్టెరాయిడ్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని అర్ధం. వీటిని ముఖ్యంగా మన శరీరంలో కలిగే నొప్పులకు, వాపులకు, బెణుకు, కీళ్ళ నొప్పి నివారణలో మరియు శరీర ఉష్నోగ్రతలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుతం ఈ NSAID మెడిసిన్ ప్రతి ఒక్కరి జీవితంలో బాగా మారింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి కావచ్చు, మనం పెరుగుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, తినే ఆహార పదార్ధాలలో జరిగే కల్తీలు కావచ్చు, మరియు మన శరీర ఆరోగ్య విషయంలో జరిగే అవగాహన రాహిత్య కారణాలు ఇవన్నీ నిత్య జీవితంలో మెడిసిన్ వాడే పరిస్థితి నెలకొంటుంది.
NSAID ప్రధాన ఉపయోగాలు:
1. నొప్పి నివారణ కొరకు :
సాధారణ నొప్పులు అయినా తలనొప్పి, కండరాల నొప్పులు, శరీర భాగాల నొప్పులు, పంటి నొప్పులు, బెణుకులు, రుతుస్రావ నొప్పులు వంటి వాటి నుండి ఉపశమనం పొందడం కోసం వాడతారు.
సాధారణంగా వాడే మెడిసిన్ యొక్క రసాయనిక పదార్ధాలు :
అసెక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ సోడియం, బాక్లోఫెన్, ఇబుప్రోఫెన్, ఇండోమెథాసిన్, కెటోరోలాక్ట్రో మెథమైన్, మెఫెనామిక్ యాసిడ్, నెప్రాక్సెన్ సోడియం, నిమెసులైడ్, పారాసెటమాల్, ట్రామెడోల్ మొదలైనవి.
వివిధ రకాలైన ఉత్పత్తులను వివిధ రసాయన పదార్ధాలను ఉపయోగించి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మందులను తయారు చేస్తారు.
2. వాపు నివారణ కొరకు :
కీళ్లనొప్పులు (అర్థరైటిస్ ), బెణుకులు లాంటి వాపును తగ్గించడానికి ఈ NSAID లను వాడతారు.
ఉదాహరణకు అల్లోపురినోల్, కొల్చిసిన్, ఎటోడోలాక్, ఎటోరికోక్సిబ్, ఫెబుక్సోస్టాట్, పిరోక్సికామ్, సెరాషియో పెప్టిడేస్, ట్రిప్సిన్ కైమో ట్రిప్సిన్
3. జ్వరం తగ్గించడానికి :
శరీర ఊష్ణగ్రతను క్రమానుగతంగా తగ్గించడానికి కూడా ఈ NSAID లను ఉపయోగిస్తుంది.
NSAID ల ప్రభావం:
ఏదైనా శరీరానికి మితం అనేది ఉపయోగకరం, అతి ఉపయోగం అనేది అనర్ధదాయకం. ఈ NSAID ల వలన కలిగే దుస్పరిమణాలు.
1. జీర్ణ సంబంధిత సమస్యలు:
ప్రస్తుత కాలంలో ఈ సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. ముఖ్యంగా కడుపు నొప్పి, వికారం, వాంతులు, గ్యాస్, గుండెలో మంట, మలబద్దకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
తీవ్రమైన సందర్భాల్లో కడుపులో అల్సర్లు, రక్తస్రావం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
2. గుండె మరియు రక్త ప్రసరణ సమస్యలు:
NSAID ల అతి వినియోగం వలన అధిక రక్తపోటు (BP) గుండె సంబంధిత రోగాలు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.
3. కిడ్నీ మరియు లివర్ సమస్యలు:
NSAID లను దీర్ఘకాలంగా వాడడం వలన మూత్ర పిండాల పని తీరు దెబ్బతినడం, అలానే శరీరంలో నీరు నిల్వ ఉండడం వలన కాళ్లలో వాపు సంభంధం జరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో లివర్ పైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
4. నాడి సంబంధిత సమస్యలు:
తల నొప్పి, తల తిరగడం, మగతగా ఉండటం అనే లక్షణాలు కనిపించవచ్చు.
5. అలర్జీ ప్రతి చర్యలు:
చర్మం పై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఆస్తమా సమస్య ఉన్నవారిలో ఈ లక్షణాలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పైన సమస్యలు కలవారు వాడాల్సి వస్తే డాక్టర్ ని సంప్రదించి వారి పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు, గుండె సంబంధించిన వ్యాధులు కలవారు, కిడ్నీ సమస్య ఉన్నవారు ఎక్కువగా వాడకూడదు.
గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వాడకూడదు, ఎందుకంటే ఇవి పిండం మీద ప్రభావాన్ని చూపే అవకాశాలు కలవు.
రక్తం పల్చబడడానికి మందులు వాడే వారు కూడ ఈ NSAID ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు అలానే చిన్న పిల్లలు కూడా వీటిని వాడేటప్పుడు డాక్టర్స్ సంరక్షణలో వాడడం చాలా ఉత్తమం.
NSAID మందులను తగిన ఆహరం తీసుకున్న తర్వాతనే ఉపయోగించాలి. ఖాళీ కడుపుతో వీటిని వాడకూడదు. నీటిని కూడ సమృద్దిగా తాగాలి అప్పుడే ఈ NSAID ల యొక్క ఉపయోగం ఉంటుంది.
0 Comments