లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర హోదాను చేర్చడం మీద డిమాండ్ చేస్తుంది.
అధికరణం 244(2) అనేది స్వయం ప్రతిపత్తి పరిపాలన విభాగాల ఏర్పాటును వివరిస్తుంది
ఆగష్టు, 5, 2019 లో జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము మరియు లడాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి.
లడాఖ్ లో లేహ్ మరియు కార్గిల్ జిల్లాలు కలవు. గతంలో వీళ్ళు జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు ఎక్కువగా అభివృద్ధికి నోచుకోలేదని వీరి అభిప్రాయం.
సమస్యలు :
లడాభ్ అనేది అంతా మంచుతో కప్పబడిన ఒక అందమైన ప్రాంతం, ఇప్పుడు ఇది కేంద్రపాలిత ప్రాంతంగా మారింది కావున ఎన్నో ప్రయివేట్ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడ్తాయి కానీ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ మారితే మరల ఆ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడం కష్టతరమవుతుంది.
అక్కడ ఉన్న sources, భూముల మిద వాళ్ళకున్న హక్కులను కోల్పోతారు.
లడాఖ్ కు అసెంబ్లీ లేదు కేవలం రెండు హాల్ కౌన్సిల్స్ మాత్రమే కార్గిల్ మరియు లేహ్ ప్రాంతాలలో ఉన్నాయి.
ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రత్యేకంగా సర్వీస్ కమిషన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
లడాఖ్ ప్రజలు లడాఖ్ ను ప్రత్యేకంగా రాష్ట్ర హోదాను కల్పించి 6వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేయడానికి గల కారణాలు.
1) 6వ షెడ్యూల్ లో చేర్చడం వల్ల ఆర్టికల్ 244 లో భాగంగా స్వతంత్ర ప్రతిపత్తిగల పరిపాలన విభాగం వస్తుంది. దీని వలన వారి భూములపై, రెవిన్యూ విషయంలో హక్కులు వారికే చెందుతాయి.
2) రాష్ట్ర హోదా రావడం వల్ల అసెంబ్లీ ఉంటుంది. అంతేగాకుండా 2 పార్ల మెంట్ స్థానాలు కావాలని కోరుతున్నారు.
3) స్వతంత్ర ప్రతిపత్తిని కల్గి ఉండటం వల్ల వారి సంస్కృతిని కాపాడుకుంటారు మరియు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
ఇందుకోసం లడాఖ్ ప్రజలు వారి యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం లేహ్ ప్రాంతంలో LBA ( లడాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్) మరియు కార్గిల్ ప్రాంతంలో KDA (కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్) ఏర్పాటు చేసుకొని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
4) 6వ షెడ్యూల్ లో చేర్చమని అడగడానికి గల ఇంకో ముఖ్య కారణం ఏంటంటే 80% పైగా షెడ్యూల్ తెగలుఇక్కడ ఉన్నారు. దాలతో జాతీయ షెడ్యుల్డ్ తెగల కమిషన్ కూడ స్వయం ప్రతిపత్తి ఇయ్యాలని కేంద్రాన్ని కోరింది.
5) ఆర్టికల్ 275(1) ప్రకారం షెడ్యూల్ తెగలు, గిరిజన ప్రాంతాలలో పరిపాలనను మెరుగు పర్చడానికి, మౌలిక సదుపాయల కల్పనకు భారత సంఘటిత నిధి నుండి గ్రాండ్స్ విడుదల అవుతాయి. దీనివలన ప్రాంత అభివృద్ధి జరుగుతుంది.
కేంద్రం 2022 లో G కిషన్ రెడ్డి ఆద్వర్యంలో మరియు 2024లో నిత్యానంద రాయ్ ఆద్వర్యంలో కమిటీలు వేశాయి.
కేంద్రం తీసుకున్న చర్యలు:
- షెడ్యూల్ 6 అనేది కేవలం ఈశాన్య రాష్ట్రాల భవితవ్యం కోసమే అని తేల్చి చెప్పింది.
- లడాఖ్ లో ST రిజర్వేషన్స్ 10% నుండి 45%. కు పెంచడానికి నిర్ణయం తీసుకుంది.
- సోసియో - ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది.
- కేంద్ర పాలిత ప్రాంతం కావున గ్రాంట్స్ సకాలంలో విడుదల చేస్తుంది.
ముగింపు:
ప్రత్యేక హోదా అనేది అభివృద్ది, పరిపాలన వికేంద్రీకరణ, గవర్నెన్స్ విషయాలలో మాత్రలు చేయాలి కాని మతం, కులం, భాష ప్రాతిపదికన కాదు అని మన రాజ్యాంగం చెబుతుంది.

0 Comments