Explain the Preamble, providing a detailed explanation of the words in the Preamble, and describe the comments made by prominent personalities on the Preamble. Why does the Preamble become controversial? Who has the right to amend the Preamble? What can we learn through the Preamble? Preamble Amendment how many times? Amendment of Preamble of Indian Constitution Preamble of India Preamble of the Indian constitution The constitution of India What is the Preamble of the constitution of India

Explain the Preamble, providing a detailed explanation of the words in the Preamble, and describe the comments made by prominent personalities on the Preamble. Why does the Preamble become controversial?  Who has the right to amend the Preamble? What can we learn through the Preamble?  Preamble Amendment how many times? Amendment of Preamble of Indian Constitution Preamble of India Preamble of the Indian constitution The constitution of India What is the Preamble of the constitution of India

     ప్రవేశిక అనేది ''రాజ్యాంగం యొక్క గుర్తింపు 
పత్రం" అని ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రసిద్ద రాజ్యాంగ  శాస్త్రవేత్త అయిన "NA ఫాల్కివాలా " అభివర్ణించారు.

     భరత రాజ్యాంగానికి మూలం భారత ప్రజల ద్వారానే ఏర్పడుతుందని ప్రవేశిక.
     ప్రవేశికలోని ముఖ్య పదాలు సార్వభౌమ, సామ్యవాదం
లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయ, స్వేచ్ఛ, సమానత్వ,
సౌబ్రాతృత్వం

1) సార్వాభౌమ: 
     దీని ప్రకారం మన దేశం ఒక స్వతంత్ర దేశం.  ఇతర ఏ దేశం మీద ఆధార పడని దేశం అని అర్దం.
     1949లో భారతదేశం కామన్ వెల్త్ సభ్య రాజ్యాంగంగా
కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ కామన్ వెల్త్ కు బ్రిటిష్
రాజు / రాణి అధినేతగా ఉంటారు. అయినప్పటికి దీనివలన
భారత దేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి ఆటంకం కలగ లేదు.
     భారత దేశం సార్వభౌమధికార రాజ్యం కావున
మనకు విదేశీ రాజ్యాలకు మధ్య ఏదైనా తన భూభాగాన్ని ఇచ్చే
హక్కు పూర్తిగా ఉంటుంది.
ఉదా: బెరుబారి కేసు 1960 (9వరాజ్యంగ సవరణ చట్టం 1960)  భారత మరియు బంగ్లాదేశ్ దేశాలు మద్య గల దేశ సరిహద్దు ప్రాంతాల సమస్యను పరిష్కరించడం భారత దేశం కోసం బెరుబారి ప్రాంతాన్ని వదులుకుంది.
     అధికరణ 2 ప్రకారం ఏదైనా విదేశీ భూభాగాన్ని భారత
యూనియన్ లో విలీనం చేసుకోవచ్చు దీని కొరకు రాజ్యాంగ  సవరణ చేసే అధికారం ఉంది, కానీ భారత యూనియన్ లోని భాగాలను విదేశాల కొరకు రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు కావున భారత ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీం కోర్టు సలహా తీసుకుంది.
     100 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భరత దేశం మరియు బంగ్లా దేశ్ ల మద్య సరిహద్దు ప్రాంతాలకు బదిలీ జరిగింది.
2) సామ్యవాదం :
     42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ఈ పదాన్ని
రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు. 
     అయితే ఈ సామ్యవాదం భావం అనేది మన రాజ్యాంగంలో
ఆదేశిక సూత్రాలలోనే ఇమిడి ఉంది. అధికరణం 36, 37 38
38(1), 39, 41, 42, 43, 43 (A)లు సామ్యవాద బావనను
వివరిస్తాయి.
     మన సామ్యవాదాన్ని ప్రజాస్వామ్య సామ్యవాదం అంటారు,  అనగా, ప్రయివేట్ రంగాలు పబ్లిక్ రంగం కూడా ఈ వ్యవస్థలో భాగంగానే ఉంటాయి.
     పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాలలో  అసమానత్వం రూపుమాపటమే ప్రజాస్వామ్య సామ్యవాద ప్రధాన ధ్యేయం అని సుప్రీం కోర్ట్ ప్రకటించారు.
     అయితే 1991లో ఆర్థిక మాంద్రం వచ్చిన తర్వాత భారత సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణలతో ఏర్పడిన నూతన ఆర్థిక విధానం వైపు అడుగులు వేయడంతో సామ్యవాద విధానాలు క్రమంగా పలుచబడుతున్నాయని
విశ్లేషకుల అంచనా.
3) లౌకిక :
     ఈ పదం 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
ప్రవేశిక లో చేర్చారు.
     మన భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదం ప్రస్పుటంగా
లేనప్పటికి కనిపించే లక్షణాలు. అధికరణం 25 నుండి 28 వరకు గల  మత స్వాతంత్రపు హక్కు అనేది లౌకిక తత్వాన్ని తెలియకుండా చేస్తుంది అని 1974లో సుప్రిం కొట్టి అభిప్రాయపడ్డారు.
     భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక వాదం సానుకూల
దృక్పథంతో ఉంటుంది కావున భారత దేశం దృష్ట్యా మన
దేశంలోని అన్ని మతాలు సమానమే, సమస్త మతాలకు
రాజ్యాంగం సమాన హోదాని, సమాన మద్దతుని ఇస్తుంది.
4) ప్రజాస్వామ్యం :
     రాజ్యాంగ ప్రవేశికలో నిక్షిప్తమైన ప్రజాస్వామ్య వ్యవస్థ
ప్రజా సార్వభౌమాధికారం అనే సిద్ధాంతం పై ఏర్పడింది, దీని
ప్రకారం ప్రజలే సార్వభౌమధికారాన్ని కల్గి ఉంటారు.
     భారత రాజ్యాంగం ప్రాతినిధ్య పార్లమెంటరీ తరహ
ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుంది. దీని ప్రకారం కార్యనిర్వహక
శాఖ తాను తీసుకున్న విదానాలకు, చర్యలకు శాసన సభ బాధ్యత వహిస్తుంది.
     ప్రజాస్వామ్య అంశాలు అయినా సార్వజనీన వయోజన
ఓటు హక్కు విదానం, నిర్దిష్ఠ కాలంలో ఎన్నికలు, సమన్యాయ పాలన, న్యాయ వ్యవస్థ, స్వాతంత్య్రం, సహేతుకత లేని వివక్షతను రూపుమాపడం వంటి అంశాలు ఎన్నో మన భారత రాజకీయ వ్యవస్థలో ఉన్నాయ్.
     ప్రవేశకలో ఉన్న "ప్రజాస్వామ్యం " అనే పదం రాజకీయ ప్రజాస్వామ్యానికే కాకుండా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యానికి వర్తిస్తుంది.
     నవంబర్ 25, 1949 నాడు రాజ్యంగ సభలో సమావేశం ముగింపు సందర్భంగా Dr. B.ర్. అంబేద్కర్ గారు ఈ క్రింది విధంగా విశ్లేషంచారు.
→ సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుండా రాజకీయ
ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ సామాజిక ప్రజాస్వామ్యం అనగా
స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌబ్రాతృత్వం ల సమూహరం.
→ అలాగే భారత గణతంత్ర సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కలుగజేసే ఒక సమసమాజ వ్యవస్థను నిర్మించడం రాజ్యాంగం యొక్క ఆశయం అని 1997 లో సుప్రీం కోర్ట్ వ్యాఖ్యనించింది.

5) గణతంత్రం (రిపబ్లిక్):
     ప్రజాస్వామ్య వ్యవస్థలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
 A) రాజరిక వ్యవస్థ      B) గణతంత్ర వ్యవస్థ

     మన దేశంలో మన దేశాధ్యక్షులు అయిన రాష్ట్రపతి పరోక్ష ఎన్నిక ద్వారా అధికారంలోకి వచ్చి నిర్ధిష్ట కాలం అయిన 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు.
6) న్యాయం (Justice) :

     రాజ్యాంగ ప్రవేశికలోని "న్యాయం" అనే లక్ష్యంలో
మాడు అంశాలు ఉన్నాయి అవి 1) సామాజిక న్యాయం
2) ఆర్థిక న్యాయం 3) రాజకీయ న్యాయం.

     మనం వీటిని ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల లోని అనేక ప్రకరణల ద్వారా సాధించుకోవచ్చు.
     ఈ మూడు అంశాలను మనం రష్యా విప్లవం (1917)
నుండి గ్రహించడం జరిగింది.
     కులం, మతం, వర్ణం, లింగం వంటి వాటిలో సామాజిక
వివక్షతలు లేకుండా అందరికి సమాన అవకాశాలు కలగడమే
సామాజిక న్యాయం.
     ఆర్థిక స్థితిగతుల కారణంగా ప్రజల మధ్య ఎటువంటి
వివక్షత చూపకపోవడం ఆర్థిక న్యాయం.
     పౌరులందరికి సమాన రాజకీయ హక్కులను పొందడం, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్గి ఉండడం అనేవి రాజకీయ న్యాయం లోని భాగం.

7) స్వేచ్ఛ (Liberty) :

     వ్యక్తుల వ్యవహారాలపై పరిమితులు విధించకపోవడం, వ్యక్తిత్వ వికాసానికి, అభివృద్ధికి తగిన అవకాశాలను కలుగజేయడం స్వేచ్ఛ యొక్క పరమార్ధం.
     ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో,
ఆరాధనలో పౌరులందరికి స్వేచ్ఛ ఉంటుందని ప్రవేశికలో పేర్కొనడం జరిగింది.
      ప్రాథమిక హక్కుల ద్వారా పరిగణించబడిన ఈ స్వేచ్ఛకు
ఒక వేళ భంగం కలిగితే న్యాయస్థానం వీటిని రక్షిస్తుంది.
     స్వేచ్ఛను ఒక లైసెన్సు గా భావించరాదు, అందుకే రాజ్యాంగంలో స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు విధించడం జరిగింది.

8) సమానత్వం :
     సమాజంలో ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు గాని, ప్రత్యేక హోదా కానీ ఇవ్వకపోవడం, సమాజంలో ఎటువంటి విచక్షణలు లేకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించడం అంటే రాజ్యాంగ ప్రవేశికలోని "సమానత్వం" అనే పదంలో కన్పిస్తుంది.
     ఉదాహరణకి అధికరణం 14 నుండి 18 వరకు సమానత్వాన్ని సూచిస్తుంది.
     రాజకీయ సమానత్వ సాధనకు రాజ్యాంగంలో రెండు అంశాలను చేర్చారు అవి :
     కులం, మతం, జాతి, లింగం ఆధారంగా ఏ వ్యక్తిని కూడా ఓటర్ల జాబితాలో చేర్చవద్దు : ఆర్టికల్ 325.
     ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటింగ్ పద్దతిలోనే లోకసభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి.
     అలానే ఆదేశిక సూత్రాలలోని 39 వ అధికరణం ప్రకారం స్త్రీ పురుష భేదం లేకుండా పౌరులు చాలినంత జీవనోపాధి శిక్షణను అనుసరించి హక్కులను కలిగి ఉంటారు.

  9) సౌబ్రాతృత్వం:
     సౌబ్రాతృత్వం అనగా సోదర భావం. 
     అధికరణం 51 A ప్రకారం భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిద్యాలను ఆదిగమించి సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించడం.

ప్రవేశికపై చేసిన వ్యాఖ్యలు :

      1) భేరుభారి కేసు (1960)
        ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది.
      2) కేశవానంద భారతి కేసు, మినర్వ మిల్స్ కేసు, LIC ఆఫ్ ఇండియా
       ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది.
       3) సజ్జన్ సింగ్ కేసు
       ప్రవేశిక క్లూప్తంగా ఉందని, సుధీర్ఘ ఆలోచన ఫలితం అని, రాజ్యాంగ నిర్మాతలు దీనికి అంతులేని ప్రాధాన్యతను ఇచ్చారని పేర్కొన్నారు.
       4) గోలక్ నాథ్ కేసు
        ప్రభుత్వం ఏ సూత్రాల ఆధారంగా నడుచుకోవాలో ప్రవేశిక లోక్లుప్తంగా గుర్తించబడింది అని ప్రవేశిక అనేది రాజ్యాంగాన్ని ఉద్దేశించి ఉపకరించే ఒక సాధనం అని చెప్పడం జరిగింది.

Post a Comment

0 Comments