Why does the Preamble become controversial? Who has the right to amend the Preamble? What can we learn through the Preamble?

       భారత  రాజ్యాంగం లోని "ప్రవేశిక" అనేది భారత దేశం అంటే ఏమిటి అని సంక్షిప్తంగా వివరిస్తుంది.

Why does the Preamble become controversial?  Who has the right to amend the Preamble? What can we learn through the Preamble?  Preamble Amendment how many times? Amendment of Preamble of Indian Constitution Preamble of India Preamble of the Indian constitution The constitution of India What is the Preamble of the constitution of India


     "ప్రవేశిక " ను మనం అమెరికా రాజ్యాంగం నుండి సంగ్రహించాము

     ప్రవేశిక లోని పదాలు అనేవి రాజ్యాంగ సభలో 1947, జనవరి 22 న జవహర్ లాల్ నెహ్రు గారు ప్రవేశపెట్టిన "ఆశయాలు- తీర్మానాలు" అనే వాటి ప్రభావంతో చేర్చబడ్డాయి.

     26, నవంబర్ 1949 న రాజ్యాంగం ఆమోదం పొందిన రోజున ఈ ప్రవేశికలో కేవలం 3 పదాలే అనగా సార్వభౌమ, గణతంత్ర మరియు ప్రజాస్వామ్యం ఉండేవి. ఇది 1950 జనవరి 26 నుండి  అమలులోకి వచ్చాయి.

     ఆ తర్వాత 42 వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) సామ్యవాదం, లౌకిక మరియు సమగ్ర పదాలను ప్రవేశికలో చేర్చబడ్డాయి. ఇవే కాకుండా న్యాయం, స్వేచ్చ, సమానత్వం, సౌబ్రాతృత్వం అనే పదాలు కూడ మన ప్రవేశకలో ఇతర పదాలుగా ఉన్నాయి.

     అయితే ప్రవేశిక నుండి మనకు తెలిసే అంశాలు  ఏంటంటే..

     1.రాజ్యాంగానికి అధికారం ఎవరు ఇచ్చారు?

Reople of Indlia అనగా మనకు మనమే

పరిపాలించుకుంటున్నామని అర్దం

     2.భారత దేశం ఎలాంటిది కావాలనుకుంటున్నారు ?

సార్వబౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు

గణతంత్ర దేశంగా కావాలనుకుంటున్నాము.

     3.భారత దేశం రాజ్యం యొక్క లక్ష్యాలు. ?

న్యాయం,స్వేచ్చ, సమానత్వం, సౌబ్రాతృత్వం.

     4.భారత దేశ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించుకుంటున్నాం

26 నవంబర్, 1949.

     ఈ విదంగా ప్రవేశికలో భారత దేశం యొక్క పూర్తి స్థాయి విలువ అనేది అవగతమవుతుంది కానీ ఈమధ్య సామ్యవాదం మరియు లేకిక అనే పదాలపై వివాదాలు తలెత్తాయి.

     నిజం చెప్పాలంటే ఈ రెండు పదాలను 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ప్రవేశికలో చేర్చక ముందే ఈ రెండు పదాలు అనేవి మన రాజ్యాంగంలో అధికరణాల రూపంలో అంతర్లీనంగా ఉన్నాయ్.

     సామ్యవాదం అనేది అధికరణాలు 36,37, 38, 38(1), 39, 41, 42, 43, 43(A) లలో ఉండగా లేకిక అనే భావజాలం మత స్వాతంత్రపు హక్కులు అయిన అధికరణల 25, 26, 27, 28  ల రూపంలో సూచించబడింది. 

     అలాగే గతంలో అనగా 2021 లో ఒడిశా రాష్ట్రం రాజ్యాంగం లోని మొదటి పేజీ అయిన ప్రవేశిక వరుస పదాలు అయినా సార్వభామ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర న్యాయ, స్వేచ్చ, సమానత్వం సౌబ్రాతృత్వం లకు అనుబందంగా "అహింసా" అనే పదాన్ని చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వం ఉండటంతో ఇది కార్యరూపం దాల్చలేదు.

     భారత రాజ్యాంగం లోని ప్రవేశికను సవరించే హక్కు కేంద్రానికి మాత్రమే కానీ రాష్ట్ర ప్రభుత్యాలకు లేదు. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ప్రవేశిక కు సవరణ జరిగింది. దానికి గల కారణం కేశవానంద భారతీ కేసులో "ప్రవేశిక"ను పరిమితంగా సవరించే అధికారం ఉన్నదని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో స్వరణ్ సింగ్ సిఫార్సుల మేరక్కు 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ప్రవేశికకు ''సామ్యవాదం'', లౌకికతత్వం'' మరియు ''సమగ్రత'' అనే 3 పదాలను చేర్చడం జరిగింది. 

     భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం తెలుసుకోవాలంటే రాజ్యాంగం యొక్క మొదటి పేజీ అయినా ప్రవేశికను చదివితే మన జాతి గర్వించదగ్గ రాజ్యాంగం విలువ అవగతం అవుతుంది.

Post a Comment

0 Comments