Does the right to freedom of expression exist for every individual in India, or does it apply only to Indian citizens/What does freedom of expression entail / freedom of expression in India /An analysis the article 19(1)(A)/ murthyadvise

 భారత దేశంలో భావ ప్రకటన స్వేచ్చా హక్కు మరియు ఇతర ప్రాధమిక హక్కులు అనేవి కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. భావ ప్రకటన హక్కు అయిన 19(1)(A) అనేది విదేశీయులకు వర్తించదు.

Does the right to freedom of expression exist for every individual in India, or does it apply only to Indian citizens/What does freedom of expression entail / freedom of expression in India /An analysis the article 19(1)(A)/ murthyadvise Article 19(1)(a) of Indian Constitution Freedom of speech and expression in Indian Constitution Restrictions on freedom of speech and expression in Indian Constitution Freedom of speech and expression Fundamental rights in India Right of freedom of expression is given under Is freedom of speech and expression absolute




     విదేశీయులకు వర్తించే ప్రాదమిక హక్కులు కేవలం ఆర్టికల్ 20 మరియు 21 మాత్రమే.


     అధికరణం 20: ఒక వ్యక్తి ఏదైనా పని చేసినప్పుడు ఆపని చట్టరిత్యా నేరమని బహుశా తప్పా ఆవ్యక్తిని శిక్షింపరాదు. నేరానికి తగిన శిక్షను కాకుండా ఎక్కువ శిక్షలు అమలు చేయరాదు.ఏ ముద్దాయిని కూడ తనకు తానుగా వ్యతిరేక సాక్ష్యం ఇవ్వాల్సిందిగా బలవంతం చేయరాదు.


     అధికరణం 21 :- జీవించేహక్కు కావున ఈ రెండు హక్కులు భారతీయులతో పాటుగా విధేశియులకు కూడా వర్తిస్తాయి.


     మిగిలిన ఆర్టికల్స్, 15, 16, 19, 29, 30 అయినా విదేశీయులకు వర్తించవు ఇవి కేవలం భారతీయ పౌరులకు మాత్రమే.


     భావ ప్రకటన అనేది స్వేచ్చాయుతమైనది, అంతర్గతమైన విషయం . ఈ ప్రకటన ఎదుటి వారికి గాని, ప్రభుత్వానికి గాని ఎలాంటి హాని కల్గించనంతవరకు ఈ ప్రకటన విలువైనది.

     బిజోయ్ ఇమాన్యూయల్ vs స్టేట్ ఆఫ్ కేరళ తీర్పుననుసరించి మౌనంగా ఉండటం కూడా బావ ప్రకటన కిందకే వస్తుంది. 


     భావ ప్రకటన అనేది మౌఖికంగా, వ్రాత మూలకంగా కూడ బహిష్కృత పర్చవచ్చు. ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నాడు అంటే అది కూడ 19(1)(A) కిందకు వస్తుంది. అతను చెప్పే పాఠాలలో ఏదైనా మతంగాని, కులాన్ని గాని, రాజకీయ పార్టీలను గానీ, ఇతరులను గాని కించపరచినంత వరకు అది భావ ప్రకటన స్వేచ్చా పరిధికి వస్తుంది.

     నేను ఇప్పుడు ఈ వ్యాసం రాస్తున్నాను ఇది కూడ భావ ప్రకటనే కిందకే వస్తుంది.


     ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు కూడా భావ ప్రకటన హక్కు హక్కు 19(1) (A) లోని భాగమే అని ఇటివల కాలంలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విమర్శించే హక్కు అనగా ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు, మరియు ఇతర ప్రాంతాలు, కులాలు, మతాల వారికి వారి మనోభావాలు దెబ్బతిననంత వరకు అని అర్దం.


     ఒక భారత పౌరుడు ఇతర దేశాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలియజెప్పడం భావ ప్రకటనలో భాగమే కానీ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం అనేది ఒక భారతీయుడిగా అది తప్పు అని చెప్పింది. 


     ఇలాంటి స్వేచ్చా పూరితమైన భావ ప్రకటన హక్కును కొందరు మత ఛాందస వాదులు, దేశ ద్రోహులు భావ ప్రకటన అనే ముసుగులో ఎదుటి వారిని రెచ్చగొట్టేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించడానికి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (2) ఉంది.


     ప్రాదమిక హక్కులు అనే వాటిపైన కొన్ని ఆంక్షలను విదించవచ్చు. ప్రాథమిక హక్కులు అనేవి నిరపేక్షమైనవి కావున వాటిపైన ప్రభుత్వాలు ఆంక్షలు విదించవచ్చు.


     ఉదాహరణకు భద్రతకే ముప్పు కలిగించేలా ప్రవర్తించినప్పుడు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినప్పుడు ఆంక్షలు విధించవచ్చు.


     ప్రాథమిక హక్కుల నియంత్రణ చట్టం కానీ G. O కానీ ఉపయోగించబడింది. గతంలో ఇది ఎవరు కూడ బయటకు రాకూడదు, శాంతి భద్రతలకు విఘాతం అని ఆంక్షలు విధించింది. ఇలా మన కేంద్ర ప్రభుత్వం అంటువ్యాధుల నియంత్రణ చట్టం - 1897 ను ఉపయోగించి ఆర్టికల్ 19 (1) (A) ను ఆపారు.


     భావ ప్రకటన హక్కు అనేది ఆర్ధిక, సామాజిక పురోగతికి మెట్టు లాంటిది, ఇంతటి అమూల్యమైన హక్కును దుర్వినియోగం కానంతవరకు మన భారత పౌరులందరు రారాజులే.

 

     


Post a Comment

0 Comments