నిజానికి రక్తంలో యూరిక్ ఆసిడ్ నిల్వలు పెరగడం అనేది భారత దేశంలో ఎక్కువగా వచ్చే సమస్య కాదు కానీ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జంక్ ఫుడ్స్, మాంసం, కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉండడం వలన ఈ సమస్య ఎక్కువైంది.
శరీరంలో యూరిక్ ఆసిడ్ నిల్వలు పెరగడం అనేది ఒక జబ్బు కాదు అది కేవలం మన ఆహార నియమావళిలో లోపించిన అసమతుల్యత మాత్రమే..... శరీరంలో ఎక్కువగా నిల్వ ఉండడం వలన కీళ్ళ నొప్పులు వస్తుంటాయి.
సాధారణంగా ఈ యూరిక్ ఆసిడ్ ను మన మూత్ర పిండాలు విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు పంపిస్తాయి. కానీ మూత్ర పిండాలలో ఫిల్టరేషన్ సరిగ్గా జరగని పక్షంలో ఇవి స్పటికాల రూపంలో మారి రక్తంలో పేర్కొనిపోతాయి. ఇలా ఏర్పడిన స్పటికాలు శరీరంలోని ఇతర బాగాలలో పేర్కొని అక్కడ వాపు సంభవించి అర్థరైటీస్ / గౌట్ వ్యాధికి కారణమవుతుంది.
శరీరంలో యూరిక్ ఆసిడ్ పెరగడానికి గల కారణాలు :
మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయకపోయినా వ్యర్థ పదార్ధాలు శరీరంలోనే పేర్కొనిపోతాయి.
ఆహార పదార్ధాలు తినే సమయాలలో జరిగే మార్పుల వలన శరీరంలో మార్పులు వచ్చి బయాలజికల్ సైకిల్ మారుతుంది.
నిద్రలేమి సమస్య కూడ శరీరంలో యూరిక్ ఆసిడ్ నిల్వలు పెరిగే అవకాశం కలదు.
పాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అలానే కూల్ డ్రింక్స్ అతిగా తాగడం వలన కూడ ఈ సమస్య పెరిగే అవకాశం ఉంది, అంతేకాదు కూల్ డ్రింక్స్ అతిగా తాగడం వలన గౌట్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనికి గల కారణం ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫ్రక్టోజ్.
వంశ పారపర్యంగా వచ్చే అధిక బరువు, అధిక ఒత్తిడి లాంటివి కూడ శరీరంలో యూరిక్ ఆసిడ్ నిల్వలు పెరిగేలా చేస్తుంది.
యూరిక్ ఆసిడ్ అనేది ఆమ్ల గుణం కలిగినది కావున రక్తానికి ఆమ్లత్వం వస్తుంది కనుక ఎవరైనా కీళ్ళ నొప్పులు ఉన్న వ్యక్తులు చింత పండు కల్గిన ఆహార పదార్ధాలు వాడితే ఇంకా నొప్పులు పెరుగుతాయి.
ఎర్రటి రంగు గల మాంసం, కిడ్డీ బీన్స్, సీ ఫుడ్స్, కొన్ని రకాల కాయ ధాన్యాలు, ఆల్కహాల్ మొదలయినవి అధిక మొత్తంలో తీసుకోకూడదు ఎందుకంటే వీటిలో ఫ్యూరిన్స్ ఎక్కువ. ఈ ఫ్యూరిన్ శాతం పెరిగితే యూరిక్ ఆసిడ్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఈ ఫ్యూరిన్ లను కాలేయం యూరిక్ ఆసిడ్ గా మారుస్తుంది. కనుక ఈ ఆహార పదార్ధలను మితంగా తీసుకోవడం ఉత్తమం.
మన శరీరంలో ఎప్పటికప్పుడు పాత కణాలు నశించి వాటి స్థానంలో కొత్త కణాలు పుడుతుంటాయి. ఈ పాత కణాల ద్వారా శరీరంలోకి ఫ్యూరిన్స్ విడుదలవుతాయి. ఇవి ఆ తర్వాత యూరిక్ ఆసిడ్ గా మారుతుంది కావున లివర్, కిడ్నీ అనేవి ఆరోగ్యవంతంగా ఉండాలి.
ఖర్జురం లో అనేక పోషక విలువలు ఉంటాయి కానీ ఫ్యూరిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కావున ఇవి ఎక్కువగా తింటే యూరిక్ ఆసిడ్ పెరుగుదలకు కారణం అవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
చక్కెర తో చేసిన ఆహార పదార్ధాలకు, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ మరియు మధ్యంకు దూరంగా ఉండాలి.
ఫ్యూరిన్స్ఎక్కువగా ఎక్కువగా ఉండే మాంసం, పప్పు ధాన్యాలు మరియు ఆహార పదార్ధాలను మితంగానే తీసుకోవాలి.
పెసర పప్పు, ఉలువలు ఫ్యూరిన్ లను తక్కువగా కల్గి ఉంటుంది కావున రోజువారి భాగంలో తీసుకోవచ్చు. అయితే రాజ్మా, అలసందలు, పచ్చి శనగ పప్పు, సోయబీన్స్, నల్ల మినుములు లలో ప్రోటీన్ శాతం ఎక్కువే కానీ ప్రోటీన్ తో పాటుగా ఫ్యూరిన్స్ కూడా ఎక్కువే కావున యూరిక్ ఆసిడ్ సమస్యతో బాధ పడేవాళ్ళు తగు జాగ్రత్తలతో వాడడం ఉత్తమం. కావున వీటిని రాత్రి పూట సాధ్యమైనంత వరకు తినకుండా ఉండాలి. అంతేగాకుండా ఏ పప్పు ధాన్యం అయినా దాదాపుగా 4-5 గంటలు నానపెట్టిన తర్వాత వండుకుంటే ఎలాంటి అనర్ధాలు మన దరి చేరవు.
స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ తినడం వలన యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు, అంతేకాదు ఇవి రక్తంలో గ్లూకోస్ ను నియంత్రణలో ఉంచగలవు.
ఎండు ద్రాక్ష లో ఫ్యూరిన్స్ శాతం ఎక్కువ కావున యూరిక్ ఆసిడ్ సమస్య వున్నవాళ్లు తక్కువగా తీసుకోవడమే మేలు.
నిమ్మకాయ యూరిక్ ఆసిడ్ ను బయటకు పంపడంలో మంచి సహాయకారిగా ఉంటుంది. యూరిక్ ఆసిడ్ తో బాధ పడేవాళ్ళు రోజుకు రెండు సార్లు తాగడం చాలా మంచిది దీనికి గల కారణం ఇందులో ఉండే విటమిన్ C .
మన శరీరం నుండి యూరిక్ ఆసిడ్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపాలంటే ప్రతి రోజు శరీరానికి కావాల్సినంత సమృద్దిగా నీరు తాగాలి. ఇది చాలా అత్యుత్తమమైన మార్గం.
ప్రతిరోజు ఆపిల్ గాని ఆపిల్ వెనిగర్ సైడర్ గాని తీసుకోవడం వలన యూరిక్ ఆసిడ్ ను కంట్రోల్ చేయవచ్చు.
క్యారెట్, బీట్రూట్ and దోస లను 3:1:1 ప్రకారం తీసుకున్న ఒక అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చు.
కీర దోస కూడా యూరిక్ ఆసిడ్ ను తగ్గిస్తుంది.
కూరగాయలు మన శరీరానికి ఆరోగ్య ప్రధాయని కానీ కాలిఫ్లవర్, బచ్చలి కూర, చామ గడ్డ, బఠాణి, వంకాయ, పుట్టగొడుగు, గోకర కాయ లాంటి వాటిలో కూడ ఫ్యూరిన్స్ శాతం ఎక్కువే కానీ యూరిక్ ఆసిడ్ సమస్యతో బాధ పడేవాళ్ళు మితంగా తీసుకుంటే ఏమి కాదు.
కొవ్వు పదార్ధాలు శాతం తక్కువగా ఉన్న పాల పదార్ధాలు మరియు గ్రీన్ టీ మంచి ఫలితాన్ని ఇస్తాయి.
ఓలీవ్ ఆయిల్ తో చేసిన వంటకాలు తినడం మంచిది. అలానే ఒమేగా 3ఫాటి ఆసిడ్స్ ఉండే ఆహారాలు, విటమిన్ E అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు ప్రతిరోజు మన ఆహారంలో ఒక భాగంగా తీసుకోవాలి.
జామ కాయలు, ఆరెంజ్, కాప్సికం, నిమ్మ, కివి, టొమోటో, ఆకుకూరలు నిత్యం తీసుకుంటూ ఉండాలి.
బ్రౌన్ రైస్, ఓట్స్ తీసుకోవాలి. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువ కావున యూరిక్ ఆసిడ్ స్థాయిని తగ్గిస్తుంది.
అరటి పండ్లలో ఆల్కలిన్, ఫ్యూరిన్ లు తక్కువగా ఉంటాయి అలానే విటమిన్ C పొటాసియం సమృద్దిగా ఉంటుంది కావున గౌట్ సమస్యకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.


2 Comments
Valuable information
ReplyDeleteThank you
ReplyDelete