పరిచయం: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధిలో ఉండి భారత నాగరికతలో ఇమడ లేని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం , మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల ఆదివాసీలను వారి సంస్కృతి సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలగకుండా వారిని అభివృద్ధి బాటలో పయనించేలా మన రాజ్యాంగం వారికి కొన్ని ప్రత్యేకతలు ఆపాదిస్తూ 6 వ షెడ్యూల్‌లో చేర్చడం జరిగింది .
దీనికి గల కారణాలు:
1) ఇతర రాష్ట్రాల ప్రజల జీవన మార్గాలను అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం లోని ఆదివాసీలు ఒంట పట్టించుకోలేదు.
2) ఇతర రాష్ట్రాలలోని ఆదివాసీలు మెజారిటీ ప్రజల మధ్య నివసిస్తున్న వారి సంస్కృతి మరియు జీవన విదానం గురించి తెలుసుకొని నాగరికతలో ఇమిడి పోయారు కానీ వీళ్ళు మాత్రం ఇప్పటికి వారి సంస్కృతి, ఆచారాలు, నాగరికతతోనే స్థిరపడ్డారు.
కనుక మన భారత రాజ్యాంగం ఈ ప్రాంతాలను వేరుగా గుర్తించి, వారిని స్వయంగా పరిపాలన అవసరమైనంత స్వయం ప్రతిపత్తిని కల్గిస్తుంది.
పరిపాలన విదానం :-
1) వీరికి స్వతంత్ర ప్రతిపత్తిగల అడ్మినిస్ట్రేషన్, స్వతంత్ర ప్రతిపత్తిగల డిస్ట్రిక్ కౌన్సిల్ [ADCJ] లను ఆర్టికల్ 244 (2) లో భాగంగా ఏర్పాటు చేస్తారు.
- ఇవి ఆ రాష్ట్రంలో కొంత శాసన, న్యాయ మరియు పరిపాలనలో స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
ఈ స్వయం ప్రతిపత్తి గల జిల్లాలను గవర్నర్ ఏర్పాటు చేయవచ్చు మరియు పునర్వవస్థీకరించవచ్చు. దీని ద్వారా గవర్నర్ ఈ ప్రాంతాల భూభాగాలను పెంచవచ్చు, లేదా తగ్గించవచ్చును లేదా వాటి పేర్లను మరియు సరిహద్దులను నిర్ధారించవచ్చు.
ఒక స్వయం ప్రతిపత్తిగల జిల్లాలో వివిధ ఆదివాసీలు ఉండే ప్రాంతాలను గవర్నర్ అనేక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలుగా మార్చవచ్చు.
ప్రతి స్వయం ప్రతిపత్తి జిల్లాకు ఒక జిల్లా మండలి ఉంటుంది. ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు. వీరిలో గవర్నర్ నలుగురిని నామినేట్ చేయగా మిగిలిన 26 మంది వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడతారు (జోడోలాండ్ లో మాత్రం 40 మంది ఉంటారు )
వీరి పదవి కాలం 5 సంవత్సరాలు.
-షెడ్యూల్ 6 లోని రాష్ట్రాలైన అస్సాంలో గవర్నర్ చేసే చట్టాలు అనేవి ఆ రాష్ట్ర శాసన సభ/ కేంద్రం చేసే చట్టాలకన్నా విలువైనవి.
- మిగిలిన రాష్ట్రాలు అయిన మేఘాలయ , త్రిపుర, మీజోరం లో చట్టాలు చేసేది రాష్ట్రపతి. ఈ చట్టాలు కూడ పార్ల మెంట్ మరియు ఆయా అసెంబ్లీలా చట్టాల కన్నా ఎక్కువ విలువైనవి .
- ఈ స్వయం ప్రతిపత్తి, గల జిల్లాల సంఖ్య రాష్ట్రాల వారిగా చూస్తే అస్సాంలో 3 జిల్లాలు, మేఘాలయాలో 3 జిల్లాలు, త్రిపురలో ఒక్క జిల్లా మరియు మిజోరంలో 3 జిల్లాలు పైన చెప్పిన విదంగా 6వ షెడ్యూల్ లో అంతర్భాగాలు.
2) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 275(1) అనేది కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు అందే సహాయక గ్రాంట్ల (Grants-in-aid) గురించి వివరిస్తుంది. ఇది ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తుంది.
ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
1. కేంద్రం నుండి రాష్ట్రాలకు నిధులు:
సహాయం అవసరమైన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని గ్రాంట్లుగా అందజేస్తుంది.
ఈ నిధులు భారత సంచిత నిధి (Consolidated Fund of India) నుండి నేరుగా చెల్లించబడతాయి.
2. గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి:
ముఖ్యంగా రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ తెగల (STs) సంక్షేమాన్ని పెంచడానికి ఈ ఆర్టికల్ కింద ప్రత్యేక నిధులు ఇస్తారు.
గిరిజన ప్రాంతాల్లో పరిపాలన స్థాయిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల స్థాయికి సమానంగా పెంచడానికి ఈ గ్రాంట్లు ఉపయోగపడతాయి.
3. అభివృద్ధి పథకాలకు మద్దతు:
ఈ నిధులతో గిరిజన ప్రాంతాల్లో కింది మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు:
విద్య: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ఏర్పాటు మరియు నిర్వహణ.
మౌలిక సదుపాయాలు: రక్షిత తాగునీరు, రోడ్లు, విద్యుదీకరణ మరియు గృహ నిర్మాణం.
ఆరోగ్యం: గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కల్పన.
4. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధన:
అది ఏమిటంటే 6వ షెడ్యూల్ కింద ఉన్న అస్సాం వంటి గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం అయ్యే అదనపు ఖర్చులను భరించడానికి ఈ ఆర్టికల్ ప్రత్యేక గ్రాంట్లను కేటాయిస్తుంది.
5. ఆర్థిక సంఘం పాత్ర:
ఏ రాష్ట్రానికి ఎంత గ్రాంట్ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ఆర్థిక సంఘం (Finance Commission) సిఫార్సులు కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ నిధులు 100% కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లుగా అందించబడతాయి, అంటే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఎటువంటి తిరిగి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు.
ఉపయోగాలు :
- ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ద్వారా స్థానికంగా ఉండే ఆదివాసులకు తమ యొక్క సంస్కృతిని, స్థానికంగా లభించే ఆదాయ వనరుల మీద స్వతంత్ర అధికారాలు కల్గి ఉండడం జరుగుతుంది.
గిరిజనుల భాష, సంస్కృతి మరియు ఆచారాలను బయటి వ్యక్తుల ప్రభావం నుండి కాపాడుకోవడానికి ఈ షెడ్యూల్ రక్షణ కల్పిస్తుంది.
-కొన్ని ప్రత్యేకమైన అంశాల మీద చట్టాలు చేయవచ్చు. అవి ఏమిటంటే భూమి, అడవులు, కాలువలు, పోడు సేద్యం, గ్రామ పాలన, ఆస్తి వారసత్వం, వివాహం, విడాకులు, సంఘా ఆచారలు వగైరా ఇలా అన్ని విదాలుగా వారి యొక్క సంస్కృతి ఆచారాలను పరిరక్షిస్తూ, వారికి ఒక ఉన్నతి మార్గంలో ప్రయాణించేలా చేయవచ్చు.
- జిల్లా మరియు ప్రాంతీయ మండళ్ళు తమ తమ అధికార పరిధిలో గల గ్రామ మండళ్ళు/ న్యాయ స్థానాలు ఏర్పాటు చేసుకొని ఆదివాసిల మద్య గల చిన్న చిన్న సమస్యలకు సత్వరం న్యాయం చేకూర్చవచ్చు.
- ప్రాధమిక పాఠశాలలు, వైద్య శాలలు, మార్కేట్లు, మత్స్యక్షేత్రాలు, రోడ్లు ఇలా ఎన్నో ప్రజా ప్రయోజన కారకాలను నిర్వర్తించవచ్చు.
-ఆదివాసేతరులచే చేయు వడ్డి వ్యాపారాలను సైతం నియంత్రణలో ఉంచవచ్చు.
-భూమి పై శిస్తు విదించి పన్నులు వసూలు చేసే అధికారం జిల్లా ప్రాంతీయ మండళ్లకు ఉంది.
- పార్లమెంట్ చట్టాలు లేదా రాష్ట్ర శాసన సభ చట్టాలు స్వతంత్ర ప్రతిపత్తిగల జిల్లాలకు వర్తించవు కాని కొన్ని నిర్ధేశిత మార్పులతో , మినహాయింపులతో వర్తిస్తాయి.
- స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లాల మరియు ప్రాంతాల పరిపాలనకు సంబందించిన విషయాలను పరిశీలించి, వాటిపై నివేదికను పొందటానికి గవర్నర్ ఒక కమిషన్ ను ఏర్పాటు చేయవచ్చు. ఈ కమిషన్ సిఫార్సు మేరకు జిల్లా లేదా ప్రాంతీయ మండలిని గవర్నర్ రద్దు చేయ వచ్చును.
ముగింపు:
స్పెషల్ ట్రీట్మెంట్ అనేది దేశం యొక్క సమగ్రతకు కానీ, సమైక్యత ను గాని దెబ్బతీస్తుంది, ఇది సమాఖ్య వ్యవస్థ కు విఘాతం అని కొందరి వాదన, కానీ సామజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది సామజిక న్యాయం యొక్క ప్రధాన ఉద్దెశ్యం.

0 Comments