PM Modi's Sensational Remarks on the Indian Economy... This Is the Real Intention!/murthyadvise.blogspot.com

reduced imports on the national economy , reduced imports, reducing import dependence, reduction in import, a decrease in imports, are imports included in national income, why imports are not included in national income, why are imports not included in national income class 12, decrease import, import reduction, why imports are not included in gdp, import restrictions were imposed in india, reducing imports meaning, low import growth rate, lack of imports, less dependence on imports, low import growth, more imports and less exports, india has not removed restrictions on imports true or false, under import substitution trade policy, there are no exports in closed economy reduce dependence on import, 0 economy, how to reduce imports in india,

      ఇటీవలి కాలంలో భారత ప్రధాని గారు దేశ ప్రజలను ఉద్దెశించి మాట్లాడుతూ “ విధేశి మారక ద్రవ్యాన్ని అత్యవసరంగా ఆదా చేయాలనీ, భారతదేశం ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేసే దిశగా బంగారం, ముడి చమురు, రసాయన ఎరువులు వంటి కీలక వస్తువుల దిగుమతులు సాధ్యమైనంత మేరకు తగ్గించాలి” అని సూచించారు.

     దీనికి గల కారణం పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి విలువపై ఒత్తిడి పడడం, విధేశి మార్పిడి నిల్వలు తగ్గడమే…..

     దీంతో విధేశి మారక ద్రవ్య వినియోగాన్ని తగ్గించడం వలన ఆర్ధిక వ్యవస్థ పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీకోసం ఈ అంశంపై చర్చిస్తున్నాను.

     విధేశి మారక ద్రవ్యం అనేది ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ కు వెన్నెముక లాంటిది, కావునా 1991 లో భారత దేశంలో చేపట్టిన ఆర్ధిక సంస్కరణల మూలంగా మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతి చేసుకునే వస్తువుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇలా ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉండడం వల్ల మన దగ్గర “కరెంట్ అకౌంట్ ” లోటు ఏర్పడుతుంది.

     మన అదృష్టం ఏంటంటే మన దేశానికి భారీగా విధేశి పెట్టుబడులు రావడం వలన “మూలధన ఖాతా మిగులు ” తో ఆ లోటు అనేది కొంత భర్తీ అవడం జరుగుతుంది.

     అయితే తాజా ప్రపంచ ఆర్ధిక పరిణామాల దృష్ట్యా దేశియంగా వస్తువుల వినియోగాన్ని తగ్గించడం వలన విధేశి మారక ద్రవ్య నిల్వలను ఆదా చేసుకోవచ్చు అనే ప్రభుత్వ ఆలోచనను కొందరు ఆర్ధిక నిపుణులు ఆచరనాత్మకంగా సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

ఇందుకోసం మన ప్రభుత్వం చేసిన ప్రతపాదనలు : 

    1). విధేశి మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాలంటే ప్రజలు కనీసం ఒక సంవత్సరం స్వచ్చందంగా బంగారం కొనుగోలు ఆపాలి. 

     దీన్ని మన ప్రభుత్వం ఒక సులభమైన మార్గం గా భావిస్తుంది. దీని గురించి కొంత వివరంగా ఇక్కడ విశ్లేషిద్దాం.

     భారత దేశం లో బంగారు గనులు చాలా పరిమితం గా ఉన్నాయి, కానీ మన దేశంలో బంగారానికి ఉన్నంత డిమాండ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇదే అసలు సిసలైన ప్రధాన సమస్య. 

     ఈ డిమాండ్ ను తట్టుకోవడానికి ప్రతి సంవత్సరం కొన్ని వందల టన్నుల కొద్దీ బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీనికి ప్రతిఫలంగా మనం అమెరికన్ డాలర్ లలో చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల RBI దగ్గర ఉండే విధేశి మార్పిడి నిల్వలు తగ్గిపోతాయి.

     ఇలా విధేశి మార్పిడి నిల్వలు తగ్గి డాలర్ విలువ పెరుగుతుంది, అలా అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీనపడుతుంది. ఇలా రూపాయి విలువ తగ్గితే ముడి చమురు దిగుమతికి ఖర్చు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల ) వస్తుంది.

     అందుకే బంగారం కొనుగోలు తగ్గితే డాలర్ లా పొదుపు జరిగి విదేశి మార్పిడి నిల్వలు సురక్షితంగా ఉంటాయి. 

     ప్రస్తుతం RBI దగ్గర దాదాపుగా 880.52 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.

     అయితే ఇక్కడ ఒక అప్రస్తుత విషయం ఏంటంటే భారత దేశ ప్రజలు మరియు దేవాలయాల వద్ద సుమారుగా 25000 నుండి 30000 టన్నుల బంగారం ఉండొచ్చని అంచనా, ఇది ప్రపంచం లోనే అతిపెద్ద ప్రయివేట్ బంగారు నిల్వలు. ఇలా భారతీయుల దగ్గర ఉన్న బంగారాన్ని ఆర్ధిక పరిభాషలో ఐడిల్ asst అంటారు, అనగా ఎటువంటి ఉత్పాదకత లేని ఆస్థి గా పరిగణించబడుతుంది. ఇది లాకర్ లలో, ఇళ్లలో ఉంటే దేశ ఆర్ధిక వ్యవస్థ కు ఎలాంటి ఉపయోగం ఉండదు.

     ఒకవేళ ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ మోనిటైజషన్ స్కీం కింద బ్యాంకు లో డిపాజిట్ చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని కొందరి ఆలోచన.

     ఎందుకంటే అప్పుడు బంగారం దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది, దీనివలన బంగారం కోసం విదేశాలకు చెల్లించే బిలియన్ ల కొద్దీ డాలర్ లు దేశంలోనే మిగిలిపోతాయి. అప్పుడు ఫోరెక్స్ నిల్వలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. ఇలా డాలర్ పై ఒత్తిడి తగ్గి రూపాయి విలువ విపరీతంగా బలపడుతుంది, బహుశా డాలర్ తో రూపాయి పోటీపడే స్థాయికి రావచ్చు.

     బ్యాంకు ల వద్ద వేల టన్నుల బంగారం లిక్విడిటి రూపంలో అందుబాటులోకి రావడం వల్ల పరిశ్రమలకు, మౌళిక వసతుల కల్పనకు తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వగలవు దాంతో దేశ GDP వేగంగా వృద్ధి చెందగలదు. అలానే ప్రజలకు అదనపు ఆదాయం వడ్డీ రూపంలో దక్కుతుంది.

     కానీ ఇక్కడున్న ప్రధాన సమస్య ఏంటంటే భారత దేశంలో బంగారానికి సాంస్కృతిక పరమైన సెంటిమెంట్ విలువలు ఎక్కువ అలానే పురాతన ఆభరణాలను, డిజైన్ లను కరిగించి కేవలం బిస్కట్ రూపంలోకి మార్చడాన్ని ప్రజలు సులభంగా అంగీకరించరు.

     ఒకేసారి అంత బంగారం బ్యాంకు లోకి వస్తే దానికి వడ్డీ చెల్లించడం అనేది కూడా బ్యాంకు లకు తలకు మించిన భారం అవుతుంది ఇలా ఆర్ధిక వ్యవస్థ పై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి.

     2) కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం వలన ముడి చమురు దిగుమతుల భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది.


     3) వంట నూనెల వాడకాన్ని తగ్గించడం ద్వారా కూడ దిగుమతులను తగ్గించవచ్చు అని ప్రధాని గారు అన్నారు.


     4) రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి అంటే వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నమాట, దీనివలన ఇటు భారత దేశానికి ఎరువుల దిగుమతి భారం కొంత తగ్గుతుంది, అటు రైతులకు ఆర్ధిక భారం తగ్గి ప్రకృతి సహజ సిద్ధ ఆహార పదార్ధలను దేశ ప్రజలకు అందించగల్గుతారు.

     భారత దేశంలో రసాయనిక ఎరువుల వాడకానికి, దేశ విధేశి మార్పిడి నిల్వలు తగ్గిపోవడానికి చాలా బలమైన మరియు ప్రత్యక్ష సంబంధం వుంది.

     ఎందుకంటే భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం. పంటల కొరకు వాడే రసాయనిక ఎరువుల తయారీకి అవసరం అయ్యే ముడి పదార్ధాల కొరత మన దేశంలో చాలా ఎక్కువ కనుక మనం విదేశాలాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.

    రసాయనిక ఎరువులలో ముఖ్యమైనది యూరియా, మరియు దీని తయారీకి సహజ వాయువు అత్యంత ముఖ్యమైన ముడి పదార్ధం. దీనికోసం మన అవసరాలకు సరిపడే సహజ వాయువును మరియు ముడి చమురును విదేశాల నుండి భారీగా దిగుమతి చేసుకుంటుంది.

     అంతర్జాతీయ మార్కెట్ లో చమురు, గ్యాస్ ధరలు పెరిగిన ప్రతిసారి, దేశంలో ఎరువుల తయారీ ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. దీనికోసం మరింత ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.

     అయినా రైతులకు భారం కాకూడదని తక్కువ ధరకు సబ్సిడీ లో అందిస్తున్న ఆ సబ్సిడీ భారం ప్రభుత్వ ఖజానా పై ఒత్తిడి పెరిగి దేశ ఆర్ధిక లోటు (Fiscal Deficit ) ఎక్కువతుంది. ఇది పరోక్షంగా రూపాయి విలువ తగ్గడానికి, విధేశి ప్రత్యక్ష పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోవడానికి దారితీస్తుంది.

     5) మనం మన అవసరాలకు విధేశి వస్తువులపై ఆధారపడకుండా పూర్తిగా స్వదేశీ విధానంలో తయారైనా వస్తువులనే వాడాలని ప్రధాని సూచించారు అంటే ఇక్కడ మన భారత ప్రభుత్వం vocal for local ను ప్రోత్సాహిస్తుంది.

ప్రభావం /నష్టాలు : 

     కేవలం దేశియంగా వస్తువుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా విధేశి మారక నిల్వలను కాపాడుకోవాలనుకోవడం అనేది దీర్ఘ కాలంలో స్తూల ఆర్ధిక వ్యవస్థకు నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     ప్రభుత్వం పిలుపుతో ప్రజలు ఆకస్మాతుగా కొనుగోలు తగ్గిస్తే మార్కెట్ లో వస్తువుల డిమాండ్ తగ్గి ఉత్పత్తి సంస్థలు మూతపడే ప్రమాదం వుంది, దీంతో వ్యాపార సంస్థలు తీవ్ర నష్టంతో మూతపడితే నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.

     దేశ వ్యవసాయ రంగానికి ఎరువులు అనేవి అత్యంత కీలకమైన అంశం. వీటి తయారీకి కావాల్సిన ముడి పదార్ధాల కొరకు ఇతర దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది మరి వీటి దిగుమతులను ఆపడం సాధ్యమా????

     దేశియంగా ముడిచమురుకు ప్రత్యామ్నాయ ఇందన వనరులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కావునా రవాణా, పారిశ్రామిక రంగాలు స్థంభించే అవకాశాలు ఉన్నాయి.

చేయాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు :

    1) విధేశి మారక ద్రవ్య నిల్వ సమస్యను పరిష్కరించాలంటే ప్రజలు తమ వినియోగాన్ని తగ్గించడం ఒక్కటే కాదు, ప్రభుత్వం పరిశ్రమల ఉత్పత్తి సామర్ధ్యం పై దృష్టి పెట్టాలి.

     అంతర్జాతీయంగా మన దేశ ఉత్పత్తులు ఇతర దేశాల ఉత్పత్తులకు గట్టి పోటీనిచ్చేలా తగిన సాంకేతిక, నాణ్యత ప్రమాణాలతో ఉత్పత్తి చేయగలగాలి.

     విధేశి ప్రత్యక్ష పెట్టుబడులు భారీ ఎత్తున ఆకర్శించేలా నూతన వ్యాపారాల స్థాపన, నిర్వహణలో సులభతరం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

     2) భారతీయులకు బంగారం పై ఉన్న మక్కువ కారణంగా గోల్డ్ మానటైజషన్ స్కీం వైపు మొగ్గు చూపరు కావునా ప్రభుత్వం బంగారం కొనుగోళ్ళను తగ్గిస్తూనే పెట్టుబడి లాభాలను పొందడానికి, అదే సమయంలో దేశి విధేశి మార్పిడి నిల్వలను కాపాడడానికి ఈ క్రింది ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.

      డిజిటల్ గోల్డ్ : 

     ఇది భౌతికంగా బంగారాన్ని చేతితో తాకకుండా మొబైల్ apps అయినా గూగుల్ పే, ఫోన్ పే, paytm లాంటి ద్వారా కొనుగోలు చేయవచ్చు.

     ఇందులో 10 రూపాయల నుండి కూడా డిజిటల్ బంగారాన్ని కొనవచ్చు. మనం కొనే ప్రతి గ్రామ్ బంగారానికి సమానమైన అసలు బంగారాన్ని సదరు సంస్థలు సురక్షితమైన వాల్ట్ లలో భద్రపరుస్తాయి.

     దీనివలన మార్కెట్ లో భౌతిక బంగారానికి తక్షణ డిమాండ్ తగ్గుతుంది ఫలితంగా విధేశి దిగుబడులపై ఒత్తిడి తగ్గుతుంది.

సోవరైన్ గోల్డ్ బాండ్స్ (SGB ):

     భారత ప్రభుత్వం RBI ద్వారా జారీ చేసే ఈ బాండ్స్ భౌతిక బంగారానికి అత్యంత సురక్షితమైన మరియు లాభాదాయకమైన ప్రత్యామ్నాయం.

     ఈ స్కీం లో మనం బంగారానికి బదులుగా ప్రభుత్వ బాండ్స్ లను కొనుగోలు చేయడం ద్వారా మనకు ఎలాంటి దొంగతనాల భయం, లాకర్ ఫీజుల భయం ఉండదు.

     బంగారం ధర పెరిగితే వచ్చే లాభం తో పాటు, ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం 2.5% అదనపు వడ్డీ కూడా లభిస్తుంది.

     ఈ బాండ్స్ కోసం ప్రభుత్వం విదేశాలనుండి బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు కనుక ఇలా ప్రజల డబ్బు దేశీయా పెట్టుబడులకు ఉపయోగపడుతుంది.

గోల్డ్ ETFs (Exchange traded funds):

     ఇది స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం లో పెట్టుబడి పెట్టే విధానం. దీనికోసం మనం ఒక డిమాట్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

     ఒక గోల్డ్ ETF యూనిట్ విలువ దాదాపు 1 గ్రామ్ స్వచ్ఛమైన బంగారం తో సమానంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లలో షేర్స్ కొన్నట్లే వీటిని కొనుగోలు చేయవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు.

     ఈ లావాదేవీలు పూర్తిగా డిజిటల్ రూపంలో జరగడం వలన నల్ల ధనం అదుపులోకి వస్తుంది మరియు దిగుమతులు భారం తప్పుతుంది.

గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ : 

     స్టాక్ మార్కెట్ పై పెద్దగా అవగాహనా లేని వారికి ఇది సులువైన మార్గం. ఇందులో నెలకు 500 రూపాయలు చొప్పున SIP ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

     3) యూరియా కు ప్రత్యామ్నాయం 

     నానో యూరియా : దేశియంగా తయారయ్యే నానో యూరియా ద్రవాన్ని వాడడం వల్ల దిగుమతులను తగ్గించవచ్చు.

     సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం : రసాయనలకు బదులుగా పశువుల పేడ, కంపోస్ట్ వంటి ప్రకృతి ఎరువులను వాడేలా ప్రోత్సాహించడం.

     PM - PRANAM : రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉదేశ్యం.

     4) vocal for local :

     మనం విధేశి వస్తువులకు బదులుగా స్వదేశీ వస్తువులను వాడడం వలన vocal for local మరియు ఆత్మ నిర్భర్ భారత్ నినాదలు దేశ విధేశి మారక ద్రవ్య నిల్వలపై అత్యంత సానుకూలమైన, విప్లవత్మాకమైన ప్రభావాన్ని చూపుతుంది.

     అంతేగాకుండా స్థానిక ఉత్పత్తులు దేశియంగా డిమాండ్ పెరిగినప్పుడు, భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల నాణ్యతను, మరియు ఉత్పత్తి సామర్ధ్యన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచుతాయి, అలా స్వదేశీ వస్తువులు విదేశాలకు ఎగుమతి అయి విధేశి మారక ద్రవ్యం మనకు డాలర్ రూపంలో చేరుతుంది.

    ఇలా చేయడం వల్ల ఎప్పుడైనా గ్లోబల్ మార్కెట్ వొడిధుడుకులకు లోనైనా ఆ ప్రభావం మన విధేశి మారక ద్రవ్య నిల్వలపై పడదు.

     దేశాల యొక్క ఆర్ధిక వ్యవస్థ అనేది ఒక సర్కస్ లో సర్కస్ చేసే వ్యక్తి ఒక తాడుపై ఒక కర్ర సహాయంతో ఎలా బాలన్స్ గా నడుస్తాడో అలా దేశ ఆర్ధిక వ్యవస్థ నడవాలి, ఏ అంశం అయినా ఎక్కువ అయినా లేదా తక్కువ అయినా ఆ ఆర్ధిక వ్యవస్థ కూలిపోయే అవకాశం ఉంటుంది.

     బంగారం కొనుగోళ్లు తగ్గించడం, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం వలన డాలర్ పొదుపు జరుగుతుంది. అలా మిగిలిన విధేశి మార్పిడి నిల్వలను దేశంలోని మౌళిక వసతుల కల్పనకు, సాంకేతిక అభివృద్ధి కి ఉపయోగించవచ్చు అనేది మన ప్రధాని ఆలోచనలోని అసలు ఉద్దేశ్యం.
     దేశ ఆర్థిక వ్యవస్థ మరియు విదేశీ మార్పిడి నిల్వల ప్రగతిపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు నేటి డిజిటల్ యుగంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై ప్రజల్లో అవగాహన పెరగడం ఎంతైనా అవసరం. 


     అయితే, ప్రజాస్వామ్యంలో ఆర్థికాంశాలతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులపై కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి.ఈ నేపథ్యంలో, గతంలో మన బ్లాగ్‌లో ప్రచురించిన రెండు ముఖ్యమైన సామాజిక, చట్టపరమైన అంశాలను కూడా ఇక్కడ చదవవచ్చు:

     భావప్రకటన స్వేచ్ఛ - హక్కులు: మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ➡️ [Does the right to freedom of expression exist for every individual in India, or does it apply only to Indian citizens/What does freedom of expression entail / freedom of expression in India /An analysis the article 19(1)(A)/ murthyadvise]


     హేట్ స్పీచ్ - పరిణామాలు: సమాజంలో పెరిగిపోతున్న ద్వేషపూరిత ప్రసంగాలు, వాటిపై ఉన్న చట్టపరమైన చర్యల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి ➡️ [Hate Speech in the Name of Freedom of Expression: Does the Constitution Permit This?/murthyadvise.blogspot.com]



Post a Comment

0 Comments