Role of the Governor: Powers, Duties/murthyadvise.blogspot.com

   
గవర్నర్ విధులు మరియు బాధ్యతలు, గవర్నర్ – భారత రాజకీయ శాస్త్ర నోట్స్, కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో గవర్నర్ పాత్ర, గవర్నర్ అధికారాలు మరియు విధులు, భారతదేశ సమాఖ్య నిర్మాణంలో గవర్నర్ పాత్ర ఒక సమీక్ష, భారత రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ల పాత్ర, భారతదేశంలో గవర్నర్ పాత్ర ఏమిటి, భారతదేశంలో గవర్నర్‌ను ఎలా ఎన్నుకుంటారు, భారత గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు,

భారత దేశంలో గవర్నర్ అనే పదవి రాష్ట్రపతి చేత నియమింపబడుతూ, తన పదవికి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందించడం అనేది రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరుగుతుంది. 

     ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్ చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించేది ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తులు.

     అయితే ఇలాంటి గొప్ప పదవి అయినా గవర్నర్ పదవి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని ఆలోచిస్తే ఈ పదవికి మొదటగా బీజం పడింది మాత్రం భారత ప్రభుత్వ చట్టం - 1858 ద్వారా.....

గవర్నర్ వ్యవస్థలో జరిగిన మార్పుల విధానాలు :

     భారత ప్రభుత్వ చట్టం -1858:

     ఈ చట్టం ద్వారా భారత దేశం లో “ఈస్ట్ ఇండియా కంపెనీ” పాలన అంతమై బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు పునాదులు ఏర్పడ్డాయి. 

     ఈ సందర్భంలో భారత దేశంలో ప్రావిన్స్ (రాష్ట్రాలు) ఏర్పడ్డాయి, వీటిని పరిపాలించడానికి గవర్నర్ జనరల్స్ ఏర్పడ్డారు. ఇలా గవర్నర్ వ్యవస్థ కి పునాది పడింది.

     మాంటెంగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు - 1919:

     ఇందులో గవర్నర్ విధుల్లో చిన్న చిన్న మార్పులు చేశారు, అనగా గవర్నర్ ను రాష్ట్రాలలో ఉండే చట్ట సభలకు రెస్పాన్సిబిల్ పర్సన్ గా చేశారు.

     భారత ప్రభుత్వ చట్టం - 1935:

     ఈ చట్టం భారత ప్రావిన్స్ లకు స్వతంత్రత ఇచ్చింది, అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను ఇవ్వడం. ఈ చట్టం ద్వారా గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రాలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉన్నాడు.

     భారత స్వతంత్రం అనంతరం :

     గవర్నర్ అనే వ్యక్తి మండలి సలహా మేరకు పని చేయాలని మంత్రి రాజ్యాంగంలో పొందుపరిచారు.

     మనం గవర్నర్ పదవిని కెనెడ రాజ్యాంగం తీసుకున్నాం. భారత్ లో గవర్నర్ ను ఎన్నికల ద్వారా కాకుండా కేవలం ఆర్టికల్ 155 ప్రకారం కేంద్రం లో కాబినెట్ ఎవరిని అయితే సూచిస్తారో ఆ వ్యక్తినే గవర్నర్ గా రాష్ట్రపతి నియమిస్తారు.

     ఇలా నియమింపబడిన గవర్నర్ రెండు రకాల బాధ్యతలను నిర్వర్తిస్తాడు.

    - రాష్ట్ర రాజ్యాంగ నేతగా 

    - కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్ గా 

     నిజానికి ఒక గవర్నర్ ఒక రాష్ట్ర రాజ్యాంగ నేతగా ఎక్కువ విధులను నిర్వర్తించాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్‌గా వ్యవహారిస్తున్నారని అపోహ…….

     గవర్నర్ అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను అభివృద్ధి పరచాలి కానీ కొన్ని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి.

గవర్నర్ వ్యవస్థ యొక్క విధి విధానాలు :

     సర్కారియా కమిషన్ (1987) గవర్నర్ అనే వ్యక్తి అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి గాకుండా వేరే రాష్ట్రానికి చెందిన వాడై ఉండాలని సూచించింది. ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఇదొక్కటే అమలు చేస్తుంది.

     గవర్నర్ అనే వ్యక్తి అత్యున్నత వ్యక్తి అయి ఉండాలి కానీ ఇది అమలు అవడం లేదు.

     గవర్నర్ గా నియమింపబడే వ్యక్తి గతంలో రాజకీయాలలో పాల్గొనకూడదు, కనీసం 2 సంవత్సరాల ముందు వరకు రాజకీయాలలో ఉండకూడదు కానీ ఇది కూడ నేటి కాలంలో అమలు కావడం లేదు.

     ఒక రాష్ట్రానికి గవర్నర్ ను రాష్ట్రపతి నియమిస్తున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి కానీ ఈ మధ్య ఇది ​​కూడా సరిగ్గా అమలు కావడం లేదు.

     ఆర్టికల్ 153(1): ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు.

     ఆర్టికల్ 153(2): ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించవచ్చు. అనగా ఒకేసారి 2,3 రాష్ట్రాలకు లేదా కేంద్ర పాలిత ప్రాంతం మరియు రాష్ట్రం కు కలిపి ఒకేసారి బాధ్యతలను నిర్వర్తించవచ్చు.

     ఆర్టికల్ 154: రాష్ట్ర కార్య నిర్వాహక అధికారం గవర్నర్ కు ఉంటుంది. గవర్నర్ అధికారాన్ని నేరుగా లేదా ఆయనకు లోబడిన అధికారుల ద్వారా రాజ్యాంగం ప్రకారం అమలు చేయాలి.

     ఆర్టికల్ 155: గవర్నర్ ను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం ఈ నియామకం జరుగుతుంది.

     ఆర్టికల్ 156: గవర్నర్ పదవీకాలం మరియు తొలగింపు. సాధారణంగా 5 సంవత్సరాలు లేదా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో ఉంటారు.

     అనగా 5 సంవత్సరాలు గ్యారంటీ అనేది ఏమి లేదు.  గవర్నర్ ను తీసివేసే విధానం అంటూ ఏమి లేదు.

     ఆర్టికల్ 157: గవర్నర్ అర్హతలు :

-35 సంవత్సరాలు నిండి ఉండాలి. 

-భారత పౌరుడై ఉండాలి. 

     ఈ రెండు విషయాలు మన రాజ్యాంగంలో పొందుపర్చారు కానీ విద్యా అర్హతలు గురించి వివరించలేదు.

     ఆర్టికల్ 158: గవర్నర్ యొక్క విశిష్ట అధికారాలు గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 14 (చట్టం ముందు అందరూ సమానులే ) గవర్నర్‌కు వర్తించదు. అనగా గవర్నర్ పై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దు. కాకపోతే సివిల్ కేసులు నమోదు చేయవచ్చు, అయితే దీనికి 2 నెలల ముందస్తు నోటీస్ ఇవ్వాలి.

     గవర్నర్ జీతం గురించి చూస్తే గవర్నర్ రెండు రాష్ట్రాలకు విధులను నిర్వర్తిస్తే ఆయా రాష్ట్రాలు ఎంత శాతం జీతం చెల్లించాలన్నది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. 

     గవర్నర్ జీతం ఆర్థిక పరిస్థితుల్లో కూడా తగ్గించరాదు. (గవర్నర్ పదవీ కాలంలో ఉన్నంత వరకు తన జీత భత్యాలు తగ్గించే వీలు లేదు) గవర్నర్ పదవికి భద్రత లేదు కానీ జీత బత్యాలకు భద్రత ఉంది.

     ఆర్టికల్ 159: గవర్నర్ ప్రమాణ స్వీకారం. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది - రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

     గవర్నర్ ను తీసివేసే ప్రోటోకాల్ విషయానికి వస్తే గవర్నర్ ను రాష్ట్రపతి తీసివేస్తాడు.

2010లో బి.పి. సింఘాల్ కేసు: 

     కేంద్ర ప్రభుత్వం మారిపోతున్నప్పుడు రాష్ట్రంలో గవర్నర్‌ను మార్చరాదు... పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తీసివేయండి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

గవర్నర్ విధులు:

     రాష్ట్రము యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి అందిస్తూ ఉంటాడు.

     రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధ పాలన విఫలం అయితే, అప్పుడు రాష్ట్రపతి పాలన కొరకు కేంద్రానికి సమాచారం (నివేదిక) ఇవ్వాలి.

గవర్నర్‌కు ఉన్న అధికారాలు:

-ఎగ్జిక్యూటివ్ పవర్ (కార్యనిర్వాహక అధికారాలు)

-లెజిస్లేటివ్ పవర్ (శాసన అధికారాలు)

-జుడీషియల్ పవర్ (న్యాయ అధికారాలు)

-ఫైనాన్షియల్ పవర్ (ఆర్థిక అధికారాలు)

-క్షమాబిక్ష అధికారం

గమనిక: రాష్ట్రపతి ఇచ్చిన క్షమాభిక్ష విషయాలలో గాని, మిలటరీ కోర్టు ఇచ్చిన విషయాలలో గాని గవర్నర్ కు క్షమాభిక్ష అధికారాలు [Pardoning Power] ఉండవు.

     కానీ రాష్ట్రపతికి కన్నా గవర్నర్ కి విచక్షణ పరిధి అధికారాలు ఎక్కువ.

     గవర్నర్ కి ఎలాంటి లాభదాయక పదవి [ఆఫీస్ ఆఫ్ లాభం] ఉండకూడదు. అంటే గవర్నర్ గా పోటీ చేసే వ్యక్తి MP/MLA/MLC గా విధులు నిర్వర్తిస్తూ ఉండకూడదు.

     UC రమేష్ కేసు (2014) లో కొన్ని పదవులు లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ లాభం) లోకి రాకుండా చేసే సవరణలు చేసే అధికారం పార్లమెంట్ కు కలదు అని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది .

     ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ తప్పనిసరిగా రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చే సలహాలను సూచనలను అనుసరించి కార్యాచరణ చేయాలి.

     గవర్నర్ కు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు తప్పితే మిగిలిన విషయాలలో ఆ రాష్ట్ర మంత్రి మండలి సలహాలు పాటించాలి.

     గవర్నర్ వ్యవస్థ సమాఖ్య వ్యవస్థకు (ఫెడరలిజం) వెన్నెముక లాంటిది.





Post a Comment

0 Comments