New Parliament House of India: Key Features & Facts for Govt Job Exams/murthyadvise.blogspot.com

 నూతన భవనం భవనం - దాని ప్రస్థానాలు

కొత్త "భారత పార్లమెంట్" భవనం !! భారత పార్లమెంట్ కోసం కొత్త భవనం, న్యూఢిల్లీ సంప్రదాయం మరియు ప్రతీకల సమ్మేళనం, భారతదేశపు కొత్త పార్లమెంట్ ... కొత్త పార్లమెంట్ భవనం పేరు కొత్త పార్లమెంట్ భవనం ఆకారం


     భారతదేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య వైభవానికి సమున్నత ప్రతీకగా నిలిచే చరిత్రాత్మక కట్టడమే 'నూతన పార్లమెంట్ భవనం'. వందలాది సంవత్సరాల వలస పాలన నీడల నుండి విముక్తమై, స్వయంసమృద్ధితో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న నవ భారత సంకల్పానికి ఇది ఒక దృశ్యరూపం. 

     భారతదేశ వైవిధ్యం, సంస్కృతి, పురాతన సంప్రదాయాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల అద్భుత కలయికతో రూపుదిద్దుకున్న ఈ భవనం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, ఇది 140 కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షల మరియు స్వేచ్ఛ స్ఫూర్తి యొక్క సజీవ సాక్ష్యం. 

     అమృత్ కాల్ (స్వాతంత్ర్య శతాబ్ది దిశగా ప్రయాణం) లో అడుగుపెడుతున్న వేళ, ఈ భవనం మన దేశ ఘన చరిత్రను చాటుతూ, నూతన శకానికి నాంది పలికింది.

     ఇండియా గేట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఉండే 3 కి.మీ ల మార్గాన్ని కర్తవ్య పథ్ / సెంట్రల్ విస్టా అంటారు. గతంలో దీనిని రాజ్ పథ్ పేరుతో పిలిచేవారు.

     ఇందులో గతంలో పాత బ్లాక్ పార్లమెంట్ భవనం, నార్త్ & సౌత్ బ్లాక్, సెక్రటేరియట్ ఉండేవి. వీటన్నింటిని కలిపి సెంట్రల్ విస్టా అని ఇదివరకు పిలిచేవాళ్లు.

     ఇప్పుడు (ప్రస్తుతం కొత్తగా) ఏర్పర్చిన సెంట్రల్ విస్టాలో ఇండియా గేట్ కు దగ్గరలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం, మార్గానికి ఇరువైపులా నూతన సెక్రటేరియట్ భవనాలు, నూతన పార్లమెంట్ భవనం, వైస్ ప్రెసిడెంట్ భవనం, నూతనంగా PM రెసిడెన్సీ భవనాలు ఉన్నాయి.

     ఇందులో భాగంగా నిర్మాణ భవన్ & విజ్ఞాన్ భవన్ లను కూల్చివేశారు. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, పాత పార్లమెంట్ లను మ్యూజియంగా ఏర్పాటు చేశారు.

కర్తవ్య పథ్ అని పేరు మార్చడానికి గల ముఖ్య కారణం: 

     భారతీయులకు ఇది బానిసత్వ ప్రతీక కాదు, కొన్ని విలువలు కూడా ఉన్నాయి. ఈ సెంట్రల్ విస్టా అనేది భారతీయులందరిది అని గుర్తు చేయడానికి 'కర్తవ్య పథ్' అని పేరు పెట్టారు.

     ప్రధాని ఇంటికి వెళ్ళే మార్గాన్ని 7 లోక్ కళ్యాణ్ మార్గ్ అంటారు. గతంలో దీనిని 7 రేస్ కోర్స్ అని పిలిచే వారు.

ఆర్కిటెక్చర్ - నిర్మాణ విధానం:

పాత సెంట్రల్ విస్టాలో ముఖ్యంగా 3 భవన నిర్మాణ సముదాయాలు ఉండేవి, అవి:

1) పార్లమెంట్ బ్లాక్: దీని నిర్మాణ శిల్పులు (ఆర్కిటెక్ట్స్) - ఎడ్విన్ ల్యూటెన్స్ & హెర్బర్ట్ బేకర్

2) రాష్ట్రపతి భవన్: దీనిని డిజైన్ చేసిన వ్యక్తి - ఎడ్విన్ లుటియన్స్ (ఎడ్విన్ ల్యూటెన్స్)

3) నార్త్ & సౌత్ బ్లాక్ (నార్త్ & సౌత్ బ్లాక్): హెర్బర్ట్ బేకర్

గమనిక: వీటిని జనవరి 18, 1927లో ఓపెన్ చేశారు. [1927లో సైమన్ కమీషన్ వచ్చింది]

నూతన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు వివరాలు:

ప్రస్తుత సెంట్రల్ విస్టా అంచనా వ్యయం: 971 కోట్లు

డిజైన్ చేసిన సంస్థ: HCP కంపెనీ (అహ్మదాబాద్) - అక్టోబర్ 2020

నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంస్థ: టాటా కంపెనీ (టాటా కంపెనీ) - సెప్టెంబర్ 2020

ప్రధాన శిల్పి: బిమల్ పటేల్ (సెప్టెంబర్ 2019 లో ప్లానింగ్ ప్రారంభం)

గమనిక: సెంట్రల్ విస్టాలో భాగంగా నిర్మించే ఏ భవనం కూడా ఇండియాగేట్ ఎత్తుకన్నా ఎక్కువగా ఉండదు.

ముఖ్యమైన తేదీలు (టైమ్‌లైన్):

డిసెంబర్ 10, 2020: కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.

జూలై 11, 2022: పార్లమెంట్ భవనం మీద జాతీయ చిహ్నం (4 సింహాలు) ప్రతిష్టించారు. (గతంలో ఈ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి).

28 మే 2023: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ఓపెనింగ్ అయింది.

కొత్త భవనాలు నిర్మించడానికి గల కారణాలు:

     పాత భవనంలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయి.

     భవిష్యత్తులో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సిటింగ్ సామర్థ్యం లేకపోవడం.

     భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు (ఆజాది కామృత మహోత్సవం) గడిచిపోయి, 100 వసంతాల దిశగా (అమృత్ కాల్) అడుగుపెడుతున్న సందర్భంగా భారతదేశం యొక్క విశిష్టతను ప్రతిబింబించే ఉద్దేశ్యంతో ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.

     ఈ నూతన పార్లమెంట్ భవనము మారుతున్న భారత స్థితిగతులను, ఆర్థికపరమైన ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెబుతుంది.

     ఇక్కడి ఆర్కిటెక్చర్ భారతీయతలో భాగంగా భారత స్వాతంత్ర్య ఎదుగుదలను సూచిస్తుంది.

     ఈ నూతన భవన నిర్మాణాలన్నీ భూకంపాలను తట్టుకొని నిలబడేలా అభివృద్ధి చేశారు.

సెంట్రల్ విస్టా / కర్తవ్య పథ్ విశేషాలు:

     ఇండియా గేట్ దగ్గర గల కింగ్ జార్జ్-V విగ్రహం స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని 28 ఫీట్ల మోనోలిథిక్ గ్రానైట్ (ఏకశిలా విగ్రహం) తో నిర్మించారు.

     ఈ గ్రానైట్ ను తెలంగాణ లోని ఖమ్మం నుండి తెప్పించారు.

ఈ విగ్రహం యొక్క శిల్పి అరుణ్ యోగి రాజ్

గమనిక: సుభాష్ చంద్రబోస్ జన్మదినం (పరాక్రమ్ దివస్) - జనవరి 23. ఇతని మరణం అస్పష్టం (18 ఆగస్టు 1945).

నూతన పార్లమెంట్ ముఖ్య ద్వారాలు (6 గేట్లు):

     పార్లమెంట్ కు 3 ముఖ్య అంశాలు ఉంటాయి. వాటి పేర్లు: జ్ఞాన్, శక్తి, కర్మ. మొత్తంగా 6 గేట్లు కలవు:

1) గజ ద్వార్ [ఎలిఫెంట్ గేట్]: ఇది పార్లమెంట్ కు ఉత్తరం వైపు ఉంటుంది. ఇది జ్ఞానాన్ని (Wisdom), సంపదను, అనుకూలతను సూచిస్తుంది.

2) అశ్వ ద్వార్ [Horse Gate]: ఇది దక్షిణ వైపు గల ద్వారం. ఇది శక్తి, బలం, ధైర్యం ను సూచిస్తుంది. ఇది ప్రభుత్వ నాణ్యతకు సింబల్ గా నిలుస్తుంది.

3) గరుడ ద్వార్ [The King of Birds Gate]: ఇది తూర్పు ద్వారం. విష్ణు వాహనానికి ప్రతీకగా ఉంటుంది. ఇది దూరాన్ని సూచిస్తుంది.

4) మకర ద్వార్ [పౌరాణిక చిహ్న ద్వారం]: ఇది హిందూ, బౌద్ధ మతాల సాంప్రదాయాలను తెలుపుతుంది. ఇది పాత పార్లమెంట్ వైపుగా ఉంటుంది. ఇది భారతదేశం యొక్క సార్వభౌమత్వ (ఏకత్వం), సమగ్రతను (వైవిధ్యం) సూచించు, వివిధత్వంలో ఏకత్వమునకు ఉదాహరణగా నిలుస్తుంది.

5) శార్దూల ద్వార్ [పౌరాణిక ద్వారం]: ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. దీని శరీరం సింహం లాగా, తల మాత్రం గుర్రం/ఏనుగు/చిలుక లాగా ఉంటుంది.

6) హంస ద్వార్ [పౌరాణిక ద్వారం]: ఇది కర్తవ్య పథ్ వైపునకు ప్రతీకగా ఉంటుంది. ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది.

🎁

     ఇది అధికార మార్పిడిని సూచిస్తుంది. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత ప్రభుత్వానికి అధికార మార్పిడి జరిగింది 1947 ఆగస్టు 14 న లార్డ్ మౌంట్ బాటన్ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు దీనిని అందించారు.

ఈ అధికార మార్పిడి సూచించిన వ్యక్తి: సి. రాజగోపాలాచారి (రాజాజీ).

     ఇది చోళ సాంప్రదాయం (Chola Tradition) ప్రకారం ఉంటుంది. దీని నమూనా నంది విగ్రహం పై బాగానా, ఇది బలం మరియు ధర్మానికి సూచికగా ఉంటుంది.

     ఇది 5 ఫీట్ల పొడవు ఉండి, వెండి మరియు బంగారంతో తయారు చేయబడింది.

     ఇన్ని రోజులు ఈ సెంగోల్ అలహాబాద్ మ్యూజియం లో భద్రపరచబడింది.

పార్లమెంట్ నిర్మాణ నేపథ్యం:

     2012లో మీరాకుమార్ స్పీకర్ గా ఉన్న సమయంలో పార్లమెంట్ కు కొత్త భవనం అవసరమని హై పవర్డ్ కమిటీ సూచించింది.

     2015 లో నాటి స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు అర్బన్ అఫైర్స్ మంత్రికి నూతన సౌకర్యాలతో కూడిన పార్లమెంట్ కావాలని లేఖ రాశారు.

     కొత్త పార్లమెంట్ లోని లోక్ సభలో 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు మొత్తంగా 1272 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

     నూతన పార్లమెంట్ లో మొదటి సమావేశం వినాయక చవితి రోజు సెప్టెంబర్ 19, 2023 న ప్రారంభమై 5 రోజుల పాటు కొనసాగుతుంది.

     కొత్త పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబడిన మొదటి బిల్లు: మహిళా రిజర్వేషన్ బిల్లు (Nari Shakti Vandan Adhiniyam)

     "నూతన పార్లమెంట్ భవనం కేవలం వర్తమాన అవసరాలను తీర్చే వేదిక కాదు, ఇది భవిష్యత్తు తరాల ప్రగతికి ఒక భరోసా మార్గం. 

     భూకంపాలను సైతం తట్టుకునే అత్యున్నత సాంకేతికతతో, పర్యావరణ హితంగా (ఎకో-ఫ్రెండ్లీ) నిర్మించబడిన ఈ అద్భుత సౌధం రాబోయే వందలాది సంవత్సరాల పాటు దేశ సేవకు అంకితం. 

     భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గ పునర్విభజనకు అనుగుణంగా, విస్తృతమైన సిటింగ్ సామర్థ్యంతో ఈ భవనం రాబోయే కాలంలో యువత మరియు మహిళా ప్రతినిధుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి దోహదపడుతుంది. 

     సాంకేతికత, సాంస్కృతిక వారసత్వం మరియు ప్రగతిశీల ఆలోచనలతో నిండిన ఈ దివ్య క్షేత్రం, రాబోయే తరాలకు ప్రజాస్వామ్య విలువలను, దేశభక్తిని మరియు ఐక్యతా స్ఫూర్తిని నిరంతరం అందిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ యవనికపై 'విశ్వగురువు'గా నిలబెట్టడంలో మార్గదర్శిగా నిలబడడంలో ఎలాంటి సందేహం లేదు.”

మీ అమూల్యమైన సలహాలను కామెంట్ ద్వారా తెలపండి. ధన్యవాదాలు 🌹🌹

పార్లమెంట్ సభ్యుల అనర్హతలు మరియు ద్వంద్వ సభ్యత్వ నియమాలు ఈ లింక్ ను క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments