Suspension of MPs and MLAs in India: Rules, Articles & Impact Explained/murthyadvise.blogspot.com

 

పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్: రాజ్యసభ 7 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంలో కేవలం తన నియమావళిని అమలు చేసింది. పార్లమెంట్ నుండి ఎంపీల సస్పెన్షన్. సస్పెన్షన్ వర్సెస్ తొలగింపు – కోణాలను అర్థం చేసుకోవడం... ఎంపీల సస్పెన్షన్. ఎమ్మెల్యేల సస్పెన్షన్. ప్రతిపక్ష ఎంపీల సామూహిక సస్పెన్షన్లు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి... లోక్‌సభ నుండి సభ్యులను ఎవరు సస్పెండ్ చేయగలరు? పార్లమెంట్‌లో ఎంపీ సస్పెన్షన్. రాజ్యసభ యొక్క యూపీఎస్సీ నియమం 256. లోక్‌సభ నియమం 374. ఎంపీ బహిష్కరణ యూపీఎస్సీ. భారతదేశంలో పార్లమెంట్ సభ్యుడి తొలగింపు.




     ఇటీవలి కాలంలో అనగా ఫిబ్రవరి 3, 2026న బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు ప్రవర్తించిన తీరు కారణంగా వాళ్ళను బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. 

     ఆ తర్వాత మార్చి 17, 2026న ఉభయ పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరిన తర్వాత ఆ సస్పెన్షన్‌ను రద్దు చేశారు.

ఈ సస్పెన్షన్‌కు గల ప్రధాన కారణాలు:

     ఆర్మీ మాజీ స్పీకర్ పుస్తకంపై వివాదం, ఈ అంశంపై మాట్లాడటానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించారు. దీనికి నిరసనగా ప్రతిపక్ష నేతలు సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా నినాదాలు చేశారు.

     ఆందోళన చేస్తున్న సమయంలో కొందరు ఎంపీలు కాగితాలు చింపి స్పీకర్ పోడియం (అధ్యక్షుడు) వైపు విసిరారు. సభ వెల్‌లోకి దూసుకెళ్లి రచ్చ చేస్తూ సభ నియమాలను ఉల్లంఘించారు. 

     సభ నిబంధనలను ఉల్లంఘిస్తూ, స్పీకర్‌కు ఇబ్బంది కలిగించడం వలన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు 7గురు కాంగ్రెస్ ఎంపీలు, ఒక సీపీఐ(ఎం) ఎంపీని సస్పెండ్ చేశారు.

     అలానే ఇదివరకు కూడా అనగా 2024 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కారణంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో 2024 డిసెంబర్ 18న లోక్‌సభ నుంచి 33 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. డిసెంబర్ 15న 13 మంది ఎంపీలు లోక్‌సభ నుండి ఒకరు రాజ్యసభ నుండి మొత్తం 14 మంది సస్పెండ్ అయ్యారు. ఇలా మొత్తంగా 92 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురికావడం అనేది దేశ చరిత్రలోనే ఒక ఆల్టైమ్ రికార్డు.

     పార్లమెంటు ఉభయ సభల్లోనూ జరిగిన భారీ భద్రతా ఉల్లంఘన (పార్లమెంటు భద్రతా ఉల్లంఘన) పై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయగా పట్టుబట్టిన ప్రతిపక్ష నేతలు సభలో నిరసనలు, ఆందోళనలు చేపట్టడం దీనికి ప్రధాన కారణం.

     డిసెంబర్ 13, 2023న లోక్‌సభలో ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి, రంగు పొగ డబ్బాలను (స్మోక్ క్యానిస్టర్‌లు) విసిరి వేశారు. ఈ ఘటనపై ప్రధాని లేదా హోంమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడి పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. 

     సభకు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు స్పీకర్ ఓం బిర్లా ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.

     ఇలా భారత పార్లమెంటులో (లోక్‌సభ లేదా రాజ్యసభ) ఎంపీలను సస్పెండ్ చేయడానికి భారత రాజ్యాంగంలో ఏ నిర్దిష్ట "ఆర్టికల్" ను నేరుగా ఉపయోగించరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 118(1) ప్రకారం, పార్లమెంట్‌లోని ప్రతి సభ కూడా తన సభ వ్యవహారాలను, సభ నిర్వహణను సజావుగా నిర్వహించేందుకు స్వంత నిబంధనలను (రూల్స్) రూపొందించుకునే అధికారం ఉంటుంది. ఈ అధికారం ఆధారంగా లోక్‌సభ మరియు రాజ్యసభలు తయారు చేసిన "రూల్స్ ఆఫ్ ప్రొసీజర్" (విధానాల నియమాలు) నిబంధనల ప్రకారమే ఎంపీలను సస్పెండ్ చేశారు.

     పైన పేర్కొన్న రెండు సందర్భాలలోనూ లోక్సభ ఎంపీలను క్రింది నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు:

1. లోక్‌సభ నియమావళి (లోక్‌సభ నియమాలు):

లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్‌కు మూడు ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి:

రూల్ 373 : సభలో ఎవరైనా సభ్యుని ప్రవర్తన సరిగ్గా లేదని స్పీకర్ భావించినప్పుడు , వారిని సభ నుండి వెంటనే వెళ్ళిపోవాలని (ఉపసంహరించుకోండి) చెప్పవచ్చు.

రూల్ 374: సభా మర్యాదలను ఉల్లంఘిస్తూ, స్పీకర్ అధికారాలను ధిక్కరిస్తూ, సభ సమయాన్ని పదేపదే వృథా చేసే సభ్యుల పేర్లను స్పీకర్ ప్రకటన చేసి, ఆ తర్వాత ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. సభ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ ఎంపీని సస్పెండ్ చేస్తారు.

రూల్ 374A (అత్యంత ముఖ్యమైనది): ఒకవేళ సభ్యులు పొడియం వైపు దూసుకెళ్లి, తీవ్ర గందరగోళం సృష్టించి, నినాదాలు చేస్తూ సభను పూర్తిగా స్తంభింపజేస్తే.. స్పీకర్ వారి పేరును ప్రకటించగానే వారు ఆటోమెటిక్‌గా (తీర్మానం అవసరం లేకుండా) 5 రోజులు లేదా ఆ సెషన్ ముగిసేవరకు సభ కు హాజరయ్యే అర్హత కోల్పోతారు.

2. రాజ్యసభ నియమావళి (రాజ్య సభ నియమాలు)

     డిసెంబర్ 2023లో లోక్‌సభతో పాటు రాజ్యసభ ఎంపీలు కూడా సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో ఆటోమెటిక్ సస్పెన్షన్ (రూల్ 374A లాంటిది) ఉండదు. అక్కడ ఈ క్రింది రూల్స్ వాడతారు:

రూల్ 255: తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యం ప్రదర్శించే వారికి ఆ రోజుకు సభ నుండి వెళ్ళిపోవాలని చైర్మన్ ఆర్డర్ జారీ చేస్తారు.

రూల్ 256: ఛైర్మన్ సభ్యుడి పేరును ప్రతిపాదించిన తర్వాత, సభలో తీర్మానం ఆమోదించడం ద్వారా ఆ సెషన్ ముగిసేవరకు సస్పెండ్ చేస్తారు.

     అయితే గతంలో కూడా రాజీవ్ గాంధీ ప్రభుత్వం హయాంలో అనగా మార్చి 1989లో 63 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దీనికి గల కారణం ఏంటంటే ఇందిరా గాంధీ హత్య పైన న్యాయమూర్తి థాకర్ కమిటీ వేశారు. ఈ కమిటీ యొక్క రిపోర్టును పార్లమెంట్ ముందు ఉంచాలి. ఈ రిపోర్టులో అసలు దోషులు ఎవరు? ఇందిరా గాంధీ భద్రతా వైఫల్యం ఎక్కడ ఉంది? ఇందిరా గాంధీ గారిని ఎలా చంపారు? వీటికి సంబంధించిన రిపోర్టును సభ ముందు ఉంచాలని ఆందోళన చేపట్టడంతో వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది.

     ఎంపీలు సస్పెండ్ విషయంలో కేవలం ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు మాత్రమే అధికారం ఉంది. సాధారణంగా సస్పెన్షన్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు కారణం ఇది 'సభ యొక్క అంతర్గత అంశం' (ఆర్టికల్ 122) కాబట్టి.......

     కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసే సస్పెన్షన్ అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అప్పుడు జ్యుడీషియల్ పరిధి (న్యాయ సమీక్షా అధికారం) లోకి వస్తుంది. గతంలో మహారాష్ట్రలోని అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలను 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. ఇలా సస్పెండ్ చేస్తే వారి నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎవరు చూడాలి? అది న్యాయం కాదు కదా! ఇది విరుద్ధం అంటూ సస్పెండ్ యొక్క కాలపరిమితి రాజ్యాంగంలో గాని, అసెంబ్లీ రూల్స్‌లో గాని, పార్లమెంట్ ఉభయ సభల రూల్స్‌లో గాని పొడిగించలేరు. కాబట్టి మీరు వారిని ప్రత్యేకంగా 1 సెషన్ వరకు లేదా కమిటీల నిర్ణయం వచ్చేంత వరకు చేయవచ్చు అని SC (సుప్రీం కోర్ట్) తీర్పునిచ్చింది.

     ఇలాంటి సస్పెన్సన్స్ ఇటీవల కాలంలో (2025 - 2026 మధ్య) వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని పరిశీలిద్ధం.

1. తెలంగాణ అసెంబ్లీ (మార్చి 2026)లో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రెండు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం మరియు చర్చల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపుతూ సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై మరో ఏథిక్స్ కమిటీ విచారణ కూడా జరిగింది.

2. ఒడిశా అసెంబ్లీ (జూన్ 2026) లో ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 7 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఎందుకంటే సభలో ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్నంగా గంటలు (గ్యాంగ్స్), తాళాలు వాయిస్తూ, పిల్లనగ్రోవులు (ఫ్లూట్స్) ఊదుతూ తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించారు. సభా మర్యాదలను ఉల్లంఘించారనే కారణంతో వారిపై ఈ చర్య తీసుకున్నారు.

3. ఢిల్లీ అసెంబ్లీ (జనవరి - మార్చి 2026)లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల వరకు సుదీర్ఘంగా సస్పెండ్ చేశారు. కారణం ఏంటంటే ఢిల్లీలో వాయు కాలుష్యం పై నిరసన తెలుపుతూ, లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వి.కె. సక్సేన ప్రసంగాన్ని ఈ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ విజయేందర్ గుప్త నిబంధనల ప్రకారం వీరిని సభ నుండి సస్పెండ్ చేశారు.

4. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ (డిసెంబర్ 2025)లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన 34 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి సస్పెండ్ అయ్యారు. కారణం ఏంటంటే విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను (ED, CBI ) బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చర్చ జరపాలని కోరుతూ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లడంతో నిబంధనల ప్రకారం ఆటోమెటిక్‌గా సస్పెండ్ అయ్యారు. అయితే, ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే స్పీకర్ ఈ సస్పెన్షన్‌ను రద్దు చేశారు.

5. కర్ణాటక అసెంబ్లీ (మార్చి 2025) లో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి, మార్షల్స్ ద్వారా సభ వెలుపలికి పంపించారు. ఎందుకంటే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'హనీప్' స్కాండల్‌పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, కాగితాలు చింపి పొడియం వైపు విసిరారు.

     రాష్ట్రాల శాసనసభలు (లెజిస్లేటివ్ అసెంబ్లీలు - ఎమ్మెల్యేలు), శాసనమండలిలలో (లెజిస్లేటివ్ కౌన్సిల్స్ - ఎమ్మెల్సీలు) కూడా పార్లమెంట్ తరహాలో రాజ్యాంగబద్ధమైన అధికారాలు మరియు స్వంత సభ నిబంధనలు (విధానాల నియమాలు) ఉంటాయి. వీటి ఆధారంగానే సభ్యులను సస్పెండ్ చేస్తారు. ఆ నిబంధలను ఒకసారి పరిశీలిద్ధం 

1. రాజ్యాంగ నిబంధనలు (రాజ్యాంగ ప్రకరణలు) ఆర్టికల్ 208(1): 

     ఈ ఆర్టికల్ ప్రకారం.. దేశంలోని ప్రతి రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి తన సభను నిర్వహించడం, నిరంతర కార్యకలాపాలను నిర్వహించడం కోసం స్వంతంగా (ప్రవర్తన నియమాలు) రూపొందించుకునే సర్వాధికారం ఉంటుంది.

ఆర్టికల్ 194: ఇది శాసనసభలు, వారి సభ్యుల అధికారాలు మరియు సభా హక్కులను (ప్రివిలేజెస్) నిర్దేశిస్తుంది. సభలో క్రమశిక్షణ రాహిత్యానికి గురైన సభ్యులను శిక్షించే లేదా సస్పెండ్ చేసే అంతర్గత అధికారం (ఇన్హెరెంట్ పవర్) ఈ ఆర్టికల్ ద్వారా సభకు లభిస్తుంది.

2. సభా నియమావళి నిబంధనలు (విధానాల నియమాలు): 

     రాజ్యాంగంలోని ఆర్టికల్ 208(1) ని బట్టి ప్రతి రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేక రూల్స్ బుక్ తయారు చేసుకుంటుంది. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మరియు మండలిలలో క్రింది రూల్స్ అసెంబ్లీ ఉన్నాయి:

శాసనసభలో (లెజిస్లేటివ్ అసెంబ్లీ):

రూల్ (నిబంధన) 300: సభలో ఎవరైనా ఎమ్మెల్యే తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యం ప్రదర్శించి , సభ మర్యాదలు ఉల్లంఘిస్తే, ఆ రోజుకు సభ నుండి వెంటనే వెలుపలికి వెళ్లిపోవాలని (ఉపసంహరించుకోండి) స్పీకర్ చెప్పవచ్చు.

రూల్ (నిబంధన) 301: ఎమ్మెల్యే ఒక సభా నిబంధనలను బేఖాతరు చేస్తూ, స్పీకర్ అధికారాన్ని ధిక్కరిస్తూ, సమయాన్ని పూర్తిగా వృథా చేస్తారు. సభ దాన్ని ఆమోదిస్తే, ఆ ఎమ్మెల్యే ఆ సెషన్ (సమావేశాలు) ముగిసే వరకు లేదా స్పీకర్ నిర్ణయించిన కొన్ని రోజుల పాటు సస్పెండ్ అవుతారు.

శాసనమండలిలో (లెజిస్లేటివ్ కౌన్సిల్):

     లోక్‌సభ, రాజ్యసభల తరహాలోనే శాసనమండలి (ఎమ్మెల్సీలు) లో కూడా సభ నిర్వహణకు ప్రత్యేక నియమాలు ఉంటాయి.   

     మండలి చైర్మన్‌కు కూడా అసెంబ్లీ స్పీకర్ తరహాలోనే సభను అదుపు చేసే అధికారాలు ఉంటాయి. 

     మండలి నిబంధనల ప్రకారం (సాధారణంగా నిబంధన 190 లేదా 191 ల వరకు), సభకు అంతరాయాన్ని కలిగించే ఎమ్మెల్సీలను ఛైర్మన్ మొదటగా సభ నుండి తప్పుకోవాలని ఆదేశిస్తారు. వినకపోతే తీర్మానం ద్వారా సభ నుండి సస్పెండ్ చేస్తారు.

సభలో సస్పెండ్ అవడానికి గల కారణాలు:

     సాధారణంగా సభలో సభ్యులు మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆందోళనలు చేస్తారు.

     సభలో ఎప్పుడైతే ప్రజల సమస్యలను లేవనెత్తుతారో అప్పుడు ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోతే సభ్యులు ఆందోళన చేస్తారు.

     కొంతమంది ప్రభుత్వ సభ్యులను ఇబ్బందులకు గురిచేయాలని చూసినప్పుడు సస్పెండ్ కు ఉన్నారు.

     రూల్స్ ఫాలో అవ్వని సభ్యులపై చర్య తీసుకోకపోతే మిగిలిన సభ్యులు ఆందోళన చేయడం వలన కూడా సస్పెన్షన్ అవుతారు.

సభ్యులను సస్పెండ్ చేసే విధానాలు:

విత్ డ్రా : మీరు హౌస్ నుండి వెళ్ళిపోండి అని అర్థం.

విత్ మోషన్ : సభ్యుని వేస్తున్నట్లు ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడం ద్వారా సస్పెండ్ చేయవచ్చు.

చలనం లేకుండా (వితౌట్ మోషన్) : ఎలాంటి తీర్మానం లేకుండానే సభ్యుడిని ఆ సెషన్ మొత్తానికి కూడా సస్పెండ్ చేయవచ్చు.

గమనిక: వితౌట్ మోషన్ (చలనం లేకుండా) అనేది కేవలం లోక్‌సభ స్పీకర్‌కి ఉంటుంది. రాజ్యసభ ఛైర్మన్‌కు లేదు. రాజ్యసభ ఛైర్మన్ సస్పెండ్ చేయాలంటే సభ్యులను ఒక తీర్మానం చేసిన తర్వాతనే సస్పెండ్ చేయాలి.

     సభలలో సస్పెండ్ చేయడం వలన 16 వ లోక్‌సభ (2014-19) లో 16% వరకు సభలోని సమయం వృధా అయ్యింది.

     17వ లోక్‌సభ (2019-2024) కాలంలో నిరసనలు, ఎంపీల సస్పెన్షన్‌లు మరియు గందరగోళం (అంతరాయలు) కారణంగా మొత్తం షెడ్యూల్ చేసిన సమయంలో సుమారు 12% నుండి 13% కాలం వృధా అయింది.

     ఇది సభ పనితీరు, సమయం మీద ప్రభావం చూపింది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

1. కోల్పోయిన గంటలు & శాతం:

     లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. చూస్తే 17వ లోక్‌సభలో వివిధ నిరసనల కారణంగా మొత్తం 387 గంటల పనిసమయం అనేది వృధా అయింది. అయినప్పటికీ, రాత్రి వేళల్లో అదనంగా సభ నిర్వహించడం వల్ల ఈ సభ యొక్క మొత్తం ఉత్పాదకత సుమారు 97% గా నమోదైంది. ఇది గత ఐదు లోక్‌సభల పదవీకాలాలతో పోల్చితే అత్యధికంగా ఉంది.

2. రద్దయిన సమావేశాలు (సిట్టింగ్స్ లాస్ట్):

     PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 17వ లోక్‌సభలో జరిగిన మొత్తం 15 సెషన్లలో 11 సెషన్‌లు ముందుగానే వాయిదా పడ్డాయి.

     దీని ఫలితంగా షెడ్యూల్ చేసిన రోజుల్లో 40 సిట్టింగ్‌లు (సమావేశాలు) జరగకుండానే రద్దయ్యాయి. అంటే మొత్తం సిట్టింగ్‌లలో 13% సమయం దీనివల్ల నష్టపోయింది.

3. ప్రశ్నల సమయం పై ప్రభావం: 

     ప్రతిపక్షాల ఆందోళనలు, సస్పెన్షన్ల ప్రభావం 'ప్రశ్నల సమయం' పై తీవ్రంగా పడింది. లోక్‌సభలో షెడ్యూల్ చేసిన ప్రశ్నల సమయంలో కేవలం 60% సమయం మాత్రమే సజావుగా సాగింది, మిగిలిన 40% సమయం గందరగోళం వల్ల వృధా అయింది.

4. చరిత్రాత్మక సస్పెన్షన్లు:

     17వ లోక్‌సభ కాలంలో పార్లమెంట్ ఉభయ సభల (లోక్‌సభ మరియు రాజ్యసభ) రికార్డు స్థాయిలో 206 సార్లు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ముఖ్యంగా 2023 వింటర్ సెషన్‌లో భద్రతా ఉల్లంఘన కారణంగా జరిగిన నిరసనల వల్లే సమయం వృధా కావడం, సామూహిక సస్పెన్షన్‌లు జరగడం జరిగింది.

     దేశ చరిత్రలోనే ఒక పూర్తికాల లోక్‌సభకు అత్యంత తక్కువ సమావేశాలు (మొత్తం 274 రోజులు) జరిగిన రికార్డు కూడా ఈ 17వ లోక్‌సభ పేరుతో నమోదైంది.

     2013లో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఏమన్నారంటే ఎవరైతే రూల్స్ ని అతిక్రమిస్తారో వారి పేర్లను చదివి శిక్షించండి. అప్పుడు వారు సిగ్గుగా ఫీల్ అవుతారు. ఇలా ప్రవర్తించే వారిని వారి లైవ్ అప్డేట్‌ను చూపించండి అప్పుడు వారి మీద రెస్పెక్ట్ తగ్గుతుంది అని పేర్కొన్నారు.

 రాజ్యాంగ స్ఫూర్తికి కలిగే అవరోధాలు (రాజ్యాంగ సవాళ్లు):

ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ఉల్లంఘన: 

     ఒక ఎంపీ సస్పెండ్ అయితే ఆ నియోజకవర్గ లక్షలాది ప్రజల గొంతు పార్లమెంట్‌లో మూగబోతుంది.

జవాబుదారీతనం లోపించడం: 

     ప్రతిపక్షాలు లేని సభలో బిల్లులు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం పొందడం కార్యనిర్వాహక శాఖపై శాసనసభ నియంత్రణను తగ్గిస్తుంది.

సమాఖ్య స్ఫూర్తి (ఫెడరలిజం): 

     రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.

న్యాయస్థానాల తీర్పులు (న్యాయ సమీక్ష):

     ఆర్టికల్ ప్రకారం 122 కోర్టులు పార్లమెంట్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.  కానీ, ఆశిష్ శేలార్ వర్సెస్ మహారాష్ట్ర అసెంబ్లీ (2022) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ప్రకారం సస్పెన్షన్ అనేది కేవలం ఆయా సమావేశాల (సెషన్) కాలపరిమితికి మాత్రమే లోబడి ఉండాలి, అంతకు మించి విధించడం రాజ్యాంగ విరుద్ధం మరియు అది రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి తప్ప శిక్షాత్మకంగా ఉండకూడదు.

పరిష్కార మార్గం:

     బ్రిటన్ పార్లమెంట్ తరహాలో ప్రతిపక్షాల కొరకు ప్రత్యేకంగా 'అపోజిషన్ డేస్' (ప్రతిపక్ష రోజులు) కేటాయించడం మరియు సభలలో ఆరోగ్యకరమైన చర్చలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతుంది.

2. భారత సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి (ఫెడరలిజం & నేషనల్ ఇంటెగ్రిటీ) కలిగే అవరోధాలు:

     ఈ సస్పెన్షన్ల ధోరణి కేవలం సభా నియంత్రణకు పరిమితం కాకుండా, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని (ప్రాథమిక నిర్మాణం) దెబ్బతీస్తోందని పైన ఉదాహరించిన సంఘటనలను చూస్తే అర్ధమవుతుంది.

రాజకీయ దుర్వినియోగం & మెజారిటీ నిరంకుశత్వం: 

     ఒక రాష్ట్రంలో అధికార పక్షానికి స్వల్ప మెజారిటీ (తక్కువ మెజారిటీ) ఉన్నప్పుడు, వివాదస్పద బిల్లులను సులువుగా ఆమోదించడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వ్యూహాత్మకంగా సస్పెండ్ చేసే అవకాశం పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య బహుళత్వాన్ని ఖూనీ చేస్తుంది.  

ప్రజల ప్రాతినిధ్య హక్కు భంగం: 

     కోర్టు వ్యాఖ్యానించినట్లు, ఒక ఎమ్మెల్యేను దీర్ఘకాలం సస్పెండ్ చేయడం అంటే ఆ వ్యక్తిని శిక్షించడం కాదు, ఈ నియోజకవర్గంలో లక్షలాది మంది ఓటర్లను (ప్రజలను) శిక్షించడమే. ఇది దేశ అంతర్గత అసంతృప్తికి దారి తీస్తుంది.  

కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ప్రభావం: 

     దేశంలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే రాష్ట్రాల అసెంబ్లీలు బలంగా ఉండాలి. కానీ శాసనసభలు ఏకపక్ష నిర్ణయాలతో బలహీనపడితే, అది దేశ సమగ్రతకు మరియు సమాఖ్య నిర్మాణ విఘాతం ను కల్గిస్తుంది.

      "శాసనసభలలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, ప్రతిపక్షాల అసమ్మతిని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. సస్పెన్షన్ అనేది కేవలం సభను సజావుగా నడిపించడానికి వాడే తాత్కాలిక నివారణ చర్యగా ఉండాలి తప్ప, ప్రతిపక్షాల గొంతు నొక్కే రాజకీయ ఆయుధంగా మారకూడదు."


Post a Comment

0 Comments